Cockroach Kingpin: అమ్మబాబోయ్.. ఒకేచోట లక్షల బొద్దింకలు.. ఆస్ట్రేలియాలో బయటపడ్డ విచిత్ర దందా!
లక్షల బొద్దింకలను స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్(Cockroach Kingpin) ను పట్టుకున్న ఆస్ట్రేలియన్ పోలీసులు.
Australian cockroach kingpin caught with 100000 illegal insects
- ఒకే చోట లక్ష బొద్దింకల పెంపకం
- ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద విచిత్ర దాడి
- మనిషి వేలంత రాక్షస కీటకాలు సీజ్
Cockroach Kingpin: ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద కీటకాల స్మగ్లింగ్ ముఠా గుట్టును అక్కడి పర్యావరణ అధికారులు రట్టు చేశారు. న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలోని బథర్స్ట్ నగరంలో ఒక వ్యాపార కేంద్రంపై అకస్మాత్తుగా దాడి చేసిన స్థానిక పర్యావరణ, నీటి సంరక్షణ విభాగం.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పెంచుతున్న దాదాపు లక్ష బొద్దింకల(Cockroach Kingpin)ను స్వాధీనం చేసుకుంది. దేశంలో ఒకేచోట ఈ స్థాయిలో కీటకాలను సీజ్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
TG Police Jobs: నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్
అధికారులు సీజ్ చేసిన వాటిలో అంతర్జాతీయంగా ప్రమాదకరమైన మడగాస్కర్ హిస్సింగ్, దుబియా జాతులకు చెందిన బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి స్థానిక వన్యప్రాణులకు, ఆస్ట్రేలియా ప్రత్యేక జీవ వైవిధ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరించారు. ఈ కారణంగానే ఇలాంటి ప్రమాదకర విదేశీ కీటకాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడం, రహస్యంగా పెంచడం లేదా ఇతరులకు విక్రయించడం చట్టప్రకారం నేరమని అధికారులు స్పష్టం చేశారు.
సాధారణ బొద్దింకలు కేవలం అంగుళం పొడవు ఉంటే, ఈ మడగాస్కర్ హిస్సింగ్ జాతి బొద్దింకలు ఏకంగా మూడు అంగుళాల వరకు పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్దవిగా గుర్తింపు పొందాయి. ఇవి మనిషి చేతి వేలు కంటే పెద్ద పరిమాణంలో, మెరిసే గోధుమ రంగులో భయంకరంగా ఉంటాయి. అయితే, కొందరు పెంపుడు పాములు, బల్లులు వంటి సరీసృపాలకు (Reptiles) ఆహారంగా వేయడానికి ఈ పెద్ద సైజు బొద్దింకలను నల్లబజారులో భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది
