Baba Vanga 2026 prediction US Israel Iran conflict trigger World War 3 and a Nuclear war
Baba Vanga US Israel Iran conflict: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకాశంలో క్షిపణులు పేలుతున్న దృశ్యాలు, ఆ వెంటే పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు, సరిహద్దుల వెంట అశాంతి, రోజురోజుకూ పెరుగుతున్న మృతుల సంఖ్యతో చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి. మధ్యప్రాచ్యంలో ప్రారంభమైన ఘర్షణలు ఐదో రోజుకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మరణించినట్టు సమాచారం. ఈ దాడులకు ప్రతీకారంగా, టెహ్రాన్ అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్‌కు చెందిన ఇతర లక్ష్యాలపై ఎదురుదాడులకు దిగింది.
ఇరాన్ నగరాలపై బాంబు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అనిశ్చిత వాతావరణంలో మరోసారి బాబా వంగా పేరు తెర మీదకు వచ్చింది. 2026లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని, పెద్ద యుద్ధం జరుగుతుందంటూ ఆమె గతంలోనే అంచనా వేసిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
2026 ఏడాది ఎలా ఉండబోతుందో అనే అంశంపై బాబా వంగా గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని, అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అన్ని దేశాలకు నష్టం వాటిల్లేలా చేస్తుందని బాబా వంగా గతంలోనే హెచ్చరించిందంటూ అనేక కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈ యుద్ధం తూర్పు ప్రాంతం నుంచి ప్రారంభమై, చివరకు మొత్తం ప్రపంచాన్ని దహించివేస్తుందని ఆమె పేర్కొన్నట్టు చెబుతున్నారు.
ఆ సమయంలో బాబా వంగా మాటలు గూఢార్థంగా, స్పష్టత లేని ప్రవచనంలా అనిపించాయి. కానీ నేడు మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే.. బాబా వంగా చెప్పింది దీని గురించే అంటూ ప్రజలు ఆమె మాటలను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు కేవలం యాదృచ్ఛికమా.. లేక ఏదైనా మహావిపత్తు ముందున్నదా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
2026లో ఒక పెద్ద యుద్ధం ప్రారంభమై, అది ప్రపంచ యుద్ధంగా మారుతుందని బాగా వంగా అంచనా వేసినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో ముఖ్యంగా యూరప్ తీవ్రంగా నష్టపోతుందని ఆమె చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో “అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు”, “ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం”, “2026లో మూడో ప్రపంచ యుద్ధం” అనే పదాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
దీంతో చాలా మంది బాబా వంగా గతంలో చేసిన ఇతర అంచనాలను కూడా తిరిగి పరిశీలిస్తున్నారు. ఆమె చెప్పిన ప్రవచనాలకు, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆమె అంచనాలపై జరిగిన కొన్ని విశ్లేషణల ప్రకారం, యుద్ధం అనంతరం యూరప్ దారుణంగా నష్టపోతుందని, ఆ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, సామాజిక సంక్షోభాలు తలెత్తే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో, ఆ అల్లకల్లోల పరిస్థితుల తర్వాత రష్యా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని బాబా వంగా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు మరింత ముందుకెళ్లి, భవిష్యత్తులో అమెరికా, రష్యా మధ్య నేరుగా ఒక పెద్ద ఘర్షణ చోటుచేసుకునే అవకాశం ఉందని కూడా ఊహిస్తున్నారు.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులపై స్పందిస్తూ తమ చర్యలను సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “ఇరాన్ అణు ఆయుధాన్ని సొంతం చేసుకోకుండా అడ్డుకోవడానికి ఈ చర్యలు అవసరం” అని పేర్కొన్నారు.