Viral Video : చెంపలు వాయించే రెస్టారెంట్.. డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్న కస్టమర్లు

అదో వింత రెస్టారెంట్.అక్కడికి వెళితే మంచి ఫుడ్ తో పాటు చెంపలు కూడా వాయగొట్టించుకోవచ్చు. అదీకూడా డబ్బులిస్తేనే కొడతారు. డబ్బులిచ్చి మరీ చెంపలు చెళ్లుమనేలా ఎడా పెడా కొట్టించుకుంటున్నారు కస్టమర్లు. ఇలా చెంపలు వాయగొట్టించుకునేందుకు జనాలు క్యూ కట్టి మరీ వస్తున్నారు...

Viral Video : చెంపలు వాయించే రెస్టారెంట్.. డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్న కస్టమర్లు

Shachihoko Ya - a restaurant in Nagoya

Viral Video: రెస్టారెంట్లకు ఎందుకు వెళతాం..? అంటే అదేం పిచ్చి ప్రశ్న..? తినటానికి వెళ్లతాం అని ఎవరైనా చెబుతారు. కానీ ఓ రెస్టారెంట్ కు వెళ్లే కష్టమర్లు మాత్రం చెంపలు వాయించుకోవటానికి వెళతారు. దాని కోసం డబ్బులు కూడా ఇస్తారు. జపాన్‌లోని నగోయా నగరంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్నారు కష్టమర్లు.

నగోయా నగరంలో ఉన్న సాచిహోకో-యా ఇకజయా అనే రెస్టారెంట్‌లో ఇదే స్పెషల్. అక్కడకు వెళ్లితే అందమైన అమ్మాయిలు వచ్చి చెంపలు వాచేలా ఈడ్చి ఈడ్చి మరీ కొడతారు. మరి అందమైన అమ్మాయిల చేతులతో కొడితే పువ్వులతో కొట్టినట్లు ఉంటుందనుకుంటున్నారో ఏమోగానీ ఈ రెస్టారెంట్ కు వచ్చి డబ్బులిచ్చి మరీ చెంపలు వాయిగొట్టించుకున్నారు కస్టమర్లు..పైగా చెంపలు వాయగొట్టటమే స్పెషల్ సర్వీసు అంటోంది ఈ రెస్టారెంట్ యాజమాన్యం..

ఈ రెస్టారెంట్‌లో టిఫిన్స్‌,స్నాక్స్, భోజనంతో పాటు చెంపలు చెళ్లుమనించే ప్రత్యేక సేవల్ని అందిస్తోంది సాచిహోకో-యా ఇకజయా అనే రెస్టారెంట్‌. అందమైన అమ్మాయిలు వరుసలో నిలబడి మరీ చెంప ఛెళ్లు ఛెళ్లుమని వాయిస్తారు. అలా కొట్టించుకోవాలని జపాన్ కరెన్సీలో 300 యెన్‌లు భారత కరెన్సీలో రూ.170 చెల్లించాలి. ఈ చెంపలు వాయించే రెస్టారెంట్ కు కస్టమర్లు రష్ మామూలుగా ఉండదు. అంటే కొట్టించుకోవానికి కూడా జపనీయులు క్యూ కడుతున్నారన్నమాట…

కొంతమంది కస్టమర్లు 300 యెన్ లు ఇచ్చి కొట్టించుకున్నా సరిపోక ఇంకా ఇంకా కొట్టమని అడుగుతారట. ‘‘హా..మరి ఊరికనే కొడతారా ఏంటీ..ఎక్స్ ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే‘నంటారు చెంపలు వాయించే ముద్దుగుమ్మలు. దీంతో అదనంగా మరో 200 యెన్ లు ఇచ్చి అంటే మొత్తం 500లు ఇచ్చి మరీ కొట్టించుకుంటున్నారు. ఈ చెంపలు వాయించే స్పెషల్ సర్వీసే ఈ రెస్టారెంట్ కు మంచి డిమాండ్ తెచ్చిపెట్టిందట. దీంతో వదేశీ పర్యాటకులు కూడా ఈ రెస్టారెంట్ కు జపాన్ కు చెందిన మహిళలు, పురుషులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా భారీగా వస్తుంటారట..!

అక్కడి అమ్మాయిలు కొట్టేకొద్దీ కొట్టించుకునేవారు మరింత రెచ్చి పోయి గట్టిగా కొట్టు అని అడిగి మరీ బాదించుకుంటారు..! ఇంతకీ ఇలా డబ్బులిచ్చి మరీ బాదించుకోవానికి ఎందుకు వెళతారు..? అనే పెద్ద డౌట్ వచ్చే తీరుతుంది…ఎందుకంటే అలా కొట్టించుకుంటే ఒత్తిడిపోతుందట..అందుకే డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్నామని చెబుతుంటారు కస్టమర్లు..!! ఇలా కస్టమర్లను చెంపలు వాయించే వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సాచిహోకో-యా ఇకజయా అనే ఈ వింత సర్వీసు అందించే రెస్టారెంట్‌ 2012లో ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ప్రారంభంలో కాస్త వివాదమైనా దానికి డిమాండ్ పెరగటం విశేషంగా మారింది. ఆ రెస్టారెంట్ ఈ వింత సర్వీస్ తోనే ఫేమస్ అయ్యింది. ఇది ప్రారంభంలో కస్టమర్లకు ఆహారాలు సర్వీస్ చేసే ముందు రెస్టారెంట్ సిబ్బంది మాత్రమే కొట్టేపని చేసేవారు. కానీ దీనికి డిమాండ్ పెరగటంతో యాజమాన్యం ప్రత్యేకంగా అనేకమంది అమ్మాయిలను నియమించుకుందా చెంపలు వాయగొట్టటానికి..!! మరి మీరు కూడా ఓ లుక్కేయండీ చెంపలు వాయగొట్టే రెస్టారెంట్ సర్వీస్ ను..