Wye River
Lost iPhone: UKలోని వ్యక్తి దాదాపు ఏడాది క్రితం నదిలో పడిపోయిన తన ఫోన్‌ను తిరిగి పొందగలిగాడు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ద్వారానే ఇది సాధ్యమైందని.. ఇంటర్నెట్ వినియోగదారులకు ధన్యవాదాలు చెబుతున్నాడు ఆ మొబైల్ యజమాని.
జూన్ నెల ప్రారంభంలో , గ్లౌసెస్టర్‌షైర్‌కు చెందిన మిగ్గీ పిస్ అనే ఫేస్‌బుక్ వినియోగదారుడు.. వైర్ నదిలో కనిపించిన ఐఫోన్‌ను ఓ గ్రూపులో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఫోన్‌ని ఇంటికి తీసుకెళ్లి బాగా ఆరబెట్టాడు. మరుసటి రోజు, మొబైల్ ఛార్జింగ్ చేసి.. ఇన్ని నెలల తర్వాత కూడా పనిచేస్తూ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ ఫోన్ లోని స్క్రీన్‌సేవర్ లో ఓ కపుల్ ఫోటో ఉంది. అందులో ఉన్న తేదీ ఆగస్టు 13. ఆ ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసి ఫోన్ యజమానిని వెదికేందుకు ప్రయత్నించాడు. పోస్టులో ఉంచిన క్యాప్షన్ చూసిన వారంతా అతనికి సాయం చేస్తూ ఫొటోలు షేర్ చేశారు.
Read Also : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
ఆ ఫోటోలను ఫోన్ యజమాని ఒవైన్ డేవిస్, అతని కాబోయే భార్య ఫియోనా గార్డనర్ స్నేహితులు గుర్తించారు. Miguel Pacheco అనే వ్యక్తి ఎడిన్‌బర్గ్‌లో ఉండే కపుల్ అడ్రస్ చిరునామాను పంపింది.
తాను, తనకు కాబోయే భార్య పడవ ప్రయాణిస్తుండగా నదిలో పడిపోవడంతో తన ఫోన్‌ను పోగొట్టుకున్నట్లు డేవిస్ మీడియాకు చెప్తున్నారు.
“ఇద్దరమే పడవలో ఉన్న సమయంలో.. నా పార్టనర్ లేచి నిలబడింది. అలా మేం నీళ్లలో పడిపోయాం. ఫోన్ నా వెనుక జేబులో నుంచి నీటిలో పడిపోయిందని గమనించా” ” అని అతను చెప్పాడు. తన ఫోన్‌ను మళ్లీ చేతికి అంతేలా చేసిన కృషి తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు.