Vladimir Putin: ట్రంప్‌తో భేటీ వేళ.. అక్కడకు ‘పూప్ సూట్‌కేస్’ తీసుకెళ్లిన పుతిన్ బాడీగార్డ్స్.. అందులో పుతిన్ మలాన్ని నిల్వ చేసి..

Vladimir Putin: పుతిన్ ఆరోగ్యంపై చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి.

Vladimir Putin: ట్రంప్‌తో భేటీ వేళ.. అక్కడకు ‘పూప్ సూట్‌కేస్’ తీసుకెళ్లిన పుతిన్ బాడీగార్డ్స్.. అందులో పుతిన్ మలాన్ని నిల్వ చేసి..

Putin

Updated On : August 18, 2025 / 5:28 PM IST

Vladimir Putin: యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పుతిన్ బాడీగార్డ్స్ ప్రత్యేకమైన “పూప్ సూట్‌కేస్” తీసుకెళ్లారని పలు రిపోర్ట్స్ తెలిపాయి. అది పుతిన్ మలాన్ని నిల్వ చేసి రష్యాకు తీసుకెళ్లే ప్రత్యేక బ్యాగ్.

పుతిన్ “పూప్ సూట్‌కేస్”ను కూడా అలస్కా పర్యటనకు తీసుకెళ్లడం మనకు అసాధారణ చర్యగా అనిపించినప్పటికీ ఇది రష్యాకు ఎంతో కీలకమైన విషయం. ఒకవేళ పుతిన్ అలస్కాలోని టాయిలెట్లలో మలవిసర్జన చేస్తే దాన్ని శత్రుదేశాలు సేకరించి, దానిపై వైద్య పరీక్షలు చేసి ఆయనకు ఉన్న వ్యాధుల గురించి తెలుసుకునే అవకాశం ఉంది.

దీంతో పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని విదేశీ శక్తులు పొందకుండా నిరోధించడమే లక్ష్యంగా ఆయన బాడీగార్డ్స్ “పూప్ సూట్‌కేస్” తీసుకెళ్లారని ది ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

Also Read: Weather Updates: తెలంగాణను వదలను అంటున్న భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు.. ఈ అన్ని జిల్లాలకు అలెర్ట్ జారీ

“పుతిన్ బాడీగార్డ్స్ ఆయన మలాన్ని సేకరించి రష్యాకు తిరిగి తీసుకెళ్తారు” అని ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సమాచారాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రెజిస్ జెంటే, మిఖాయిల్ రుబిన్ వెల్లడించారు.

చాలా సంవత్సరాలుగా ఇదే పద్ధతి

ఆయా జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా అధ్యక్షుడి ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ (FPS) సభ్యులు ఆయన మలాన్ని ప్రత్యేక బ్యాగుల్లో నిల్వ చేసి, ప్రత్యేక బ్రీఫ్‌కేస్‌లలో తరలిస్తారు.

ది ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. 2017లో పుతిన్ ఫ్రాన్స్ సందర్శన సమయంలో కూడా ఇదే విధానాన్ని పాటించారు. మాజీ BBC జర్నలిస్ట్ ఫరీదా రుస్తమోవా తెలిపిన వివరాల ప్రకారం.. వియన్నా పర్యటనలో పుతిన్ పోర్టబుల్ టాయిలెట్ ఉపయోగించినప్పుడు కూడా ఇదే జాగ్రత్తలు తీసుకున్నారు.

పుతిన్‌కు వ్యాధులు

పుతిన్ ఆరోగ్యంపై చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. గత సంవత్సరం నవంబరులో కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పుతిన్ కాళ్లు వణుకుతూ కనిపించడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

డాక్టర్ బాబ్ బెరూఖిమ్ ప్రకారం.. ఇది పార్కిన్‌సన్స్ వ్యాధి వంటి సమస్యకు సంకేతం కావచ్చని ది ఎక్స్‌ప్రెస్ US తెలిపింది.

2023లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోను కలిసినప్పుడు కూడా పుటిన్ వణికినట్లు గమనించారు.

అదనంగా, ది ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్ గతంలో హార్ట్ అటాక్‌కు గురై, అధికారిక నివాసంలో ఐసీయూలో చికిత్స పొందారని కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి.