H9n2: కొవిడ్ తర్వాత చైనా నుంచి మరో మహమ్మారి.. వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌9ఎన్2

ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

H9n2: కొవిడ్ తర్వాత చైనా నుంచి మరో మహమ్మారి.. వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌9ఎన్2

H9n2: కొవిడ్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా బయటపడనేలేదు. అప్పుడే డ్రాగన్ దేశం నుంచి మరో మహమ్మారి జెడలు విప్పుతోంది. చైనాలో కొత్తగా హెచ్‌9ఎన్2 వైరస్ వ్యాపిస్తోంది. ఇది ఎంత వేగంగా వ్యాపిస్తోందంటే.. ఇప్పటికే ఉత్తర చైనాలో వందల మంది చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. కొవిడ్ అనంతరం తలెత్తిన ముప్పు కావడంతో.. మన దేశంలోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ వైరస్ ప్రభావం ఎలా ఉందనే దానిపై భారత ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.