భారత్ లో కొత్తగా 6 అణు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వీటి ఏర్పాటుకు సహకారం అందించనుంది. భారత్-అమెరికా మధ్య అణు సహకారానికి సంబంధించి 2008 అక్టోబర్ లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. పౌర సంబంధ అణు కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని అమెరికా అంగీకరించింది. ఆ ఒప్పందానికి అనుగుణంగా భారత్ లో 6 అటామిక్ ప్లాంట్లు నిర్మించడానికి అమెరికా ఓకే చెప్పింది.
Read Also : మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో ఈ మేరకు అమెరికా ప్రకటన చేసింది. భారత్ లో అణు కేంద్రాల ఏర్పాటు విషయంలో చైనా అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇది 150 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్. గుజరాత్ లో ఇప్పటికే 2వేల 500 మెగావాట్ల సామర్థ్యంతో అణు కేంద్రం ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో మిగతా న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి అడుగులు పడనున్నాయి.