Bill Gates: ‘బిల్ గేట్స్.. పెళ్లి చేసుకుందాం రా’ అంటూ ఆఫర్ చేసిన కువైట్ నటి
కువైట్ నటి, సింగర్ అయిన షామ్స్ బందర్ అల్ అస్లామీ.. అమెరికా బిలియనీర్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కు పెళ్లి చేసుకుందాం రమ్మంటూ ఆఫర్ ఇచ్చింది. ట్వీట్ ద్వారా ఈ ప్రపోజల్ పెట్టింది
- Subhan Ali Shaik
- Published On : November 10, 2021 / 11:44 AM IST
Bill Gates
Bill Gates: కువైట్ నటి, సింగర్ అయిన షామ్స్ బందర్ అల్ అస్లామీ.. అమెరికా బిలియనీర్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కు పెళ్లి చేసుకుందాం రమ్మంటూ ఆఫర్ ఇచ్చింది. ట్వీట్ ద్వారా ఈ ప్రపోజల్ పెట్టింది.
ఆగష్టులో తెలిపిన వివరాల ప్రకారం.. బిల్ గేట్స్ ప్రపంచంలోనే ఐదో అత్యంత ధనవంతుడు. రీసెంట్ గా భార్య మెలిందాతో తెగదెంపులు చేసుకున్నాడు.
గతంలో ‘ఏదో వైరస్ ప్రపంచంలో పెద్ద నష్టాన్ని చూపిస్తుందని.. శాస్త్రీయ పరిశోధన కోసం నిధులు సమకూర్చాలని ముందుగానే డిమాండ్ చేశాడు. అలా జరగబోయేదాని గురించి రెడీగా ఉన్నాడు.’ అంటూ దానికి సంబంధించిన ట్వీట్ కు ట్యాగ్ చేస్తూ.. ‘అందమైన వ్యక్తి, ఎలక్ట్రానిక్ యుగాన్ని ఏలుతున్న వాడు. అంచనాలతో ఎక్కడి వరకూ ఎలా ఎదగాలో తెలిసిన వాడు. అందుకే అతనికి ఈ ఆఫర్ ఇస్తున్నాను’ అని చెప్పింది.
………………………………………………: యూపీలో 100కు చేరిన జికా వైరస్ కేసులు
ప్రాంతీయ మీడియా కథనం ప్రకారం.. బిల్ గేట్స్ పెళ్లి చేసుకోవచ్చంటూ ఆమె చేసిన ట్వీట్ చాలా తప్పుడు ఉద్దేశ్యంతో ప్రచారం జరిగిందని రాసుకొచ్చింది. మీడియా కథనం ప్రకారం.. ఆమె ఆ ట్వీట్ పట్ల సీరియస్ గా లేదని, ఆమె వ్యంగ్యంగా మాత్రమే అలా చేసిందని అంటున్నారు.
