500 ఏళ్ల ఆచారం.. ఆ దేవాలయంలో నగ్నంగా భక్తుల పూజలు

  • Publish Date - February 18, 2020 / 10:35 AM IST

జపాన్​​ లో​ ప్రతీసంవత్సరం ఫిబ్రవరి మూడో శనివారం రోజు ఒక విచిత్రమైన పండుగను జరుపుకుంటరు. అదే.. ‘నేకెడ్​ ఫెస్టివల్​’. ఈ పండుగతో వేలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ ఫెస్టివల్ ఒకయామా పరిధి హోన్షు ఐలాండ్ లోని సైదైజీ కన్నోనియాన్ టెంపుల్​ లో జరుగుతుంది.

ఈ పండుగ​ను చూసేందుకు జపాన్ ప్రజలు మాత్రమే కాకుండా  విదేశాల నుంచి టూరిస్టులు కూడా తరలి వస్తుంటారు. ఈ ఏడాది పండుగ చాలా ఘనంగా నిర్వహించారు. శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించారు. ఈ ఉత్సవంలో దాదాపు 10 వేల మందికి పైగా పురుషులు పాల్గొన్నరు.  

ఇందులో వేలాది మంది పురుషులు గోచి కట్టుకొని, కాళ్లకు రెండు సాక్సులు వేసుకొని చల్లని నీటిలో దేవాలయం చుట్టూ తిరుగుతుంటారు. ఇలా గంటసేపు చేస్తారు. రాత్రి 10 గంటలకు లైట్లు వెలగగానే పూజారి 100 బండిళ్ల చెట్ల కొమ్మలు, ఒక రెండు లక్కీ షింగీ కట్టెలను ఆ జనంలోకి విసురుతారు. ఈ కొమ్మలు, కట్టెల కోసం అందరు పోటీ పడతారు. ఒకరినొకరు తోసుకుంటూ వాటి కోసం ఎగబడతారు. 

ఈ తోక్కులాటలో కొంతమందికి దెబ్బలు కూడా తగులుతుంటయి. కాళ్లు, చేతులు కూడా ఇరుగుతుంటాయి. వామ్మో ఒక కర్ర కోసం ఎందుకు ఇంత రిస్క చేస్తున్నారని అనుకుంటున్నారా.?  ఆ కొమ్మలు, కట్టెలు దొరికితే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే  పంటలు బాగా పండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సంతాన భాగ్యం కలగాలని ఈ పండుగను నిర్వహిస్తుంటారు. 

అసలు విషయం ఏమిటంటే?
ఈ పండుగ​కు 500 ఏళ్లనాటి చరిత్ర ఉంది. సైదైజీ కన్నోనియన్ టెంపుల్​ లో పూజారి ఇచ్చే తాయతు పేపర్ల కోసం గ్రామస్తులు పోటీ పడేవారు. ఆ పేపరు దొరికితే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. అయితే జనం ఎక్కువగా రావడంతో పూజారి ఇచ్చే పేపర్లు చినిగిపోతున్నాయి.

అంతేకాదు ఒకరినొకరు తోసుకోవడంతో వారి బట్టలూ చినిగిపోయేవి. అందుకని పేపర్ ప్లేస్ ​లో కట్టెలు, కొమ్మలు ఇవ్వడం ప్రారంభించారు. అలాగే బట్టలు లేకుండా పాల్గొనాలనే నిబంధన పెట్టారు. అలా ఇది నేకెడ్​ ఫెస్టివల్గా మారింది.