Covid-19: కొవిడ్ సహజంగానే పుట్టిందనడానికి కొత్త సాక్ష్యం

లేటెస్ట్ గా జరిపిన లాన్సెట్ జర్నల్ లో.. 24 మంది బయాలజిస్టులు, ఎకాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టులు, ఫిజియన్లు, పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, వెటరినెరియన్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు పాల్గొన్నారు.

Covid 19

Covid-19: కరోనావైరస్ చైనాలోని ల్యాబొరేటరీay పుట్టిందనడానికి సైంటిఫిక్ గా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని మరో స్టడీ నిరూపించింది. లేటెస్ట్ గా జరిపిన లాన్సెట్ జర్నల్ లో.. 24 మంది బయాలజిస్టులు, ఎకాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టులు, ఫిజియన్లు, పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, వెటరినెరియన్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు పాల్గొన్నారు.

‘సైంటిఫిక్ లిటరేచర్ కు సంబంధించి స్ట్రాంగెస్ట్ క్లూ అందింది. నేచర్ లో వైరస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తేలింది. పైగా మహమ్మారి ఆవిర్భావం ల్యాబొరేటరీ నుంచి పుట్టిందనే సైంటిఫిక్ కథనం ఎక్కడ నిరూపితం కాలేదని’
ప్రచురితమైన సైంటిఫిక్ జర్నల్‌ మరో సాక్ష్యంగా మారింది.

లేటెస్ట్ రిపోర్ట్ లో చాలా దేశాలు కరోనావైరస్ మూలాల గురించి విచారణ జరిపించాలని చైనీస్ ల్యాబ్ నుంచి లీక్ అవడం వల్లనే ఇలా జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆరోపణలు, ఊహాగానాలు ఎటువంటి సాయం చేయలేవు. ఈ క్రమంలోనే అది ప్రకృతి నుంచి వచ్చిందని తెలిస్తే భవిష్యత్ మహమ్మారి వ్యాప్తి జరగకుండా లేదంటే అసలే రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.

కొత్త వైరస్ లు ఎక్కడైనా పుట్టొచ్చు. సైంటిఫిక్ ఎంక్వైరీ వెలుగులోకి రానంత వరకూ రాబోయే మహమ్మారి గురించి ముందస్తు జాగ్రత్తతో ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన.. సైంటిఫిక్ పేపర్లను కచ్చితంగా సపోర్ట్ చేయాలి. అని జర్నల్ రాసిన రచయితలు వివరిస్తున్నారు.