China Tour: చైనా పర్యటనకు పాక్ ప్రధాని.. వ్యూహాత్మక సహకారం ఇదరు దేశాల ఎజెండా!
పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం, రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేసినా డబ్బులు అడుగుతారని అనుకుంటున్నారని, ప్రపంచం ముందు పాకిస్తాన్ బిచ్చగాడిలా నిల్చోందని అన్నారు
- tony bekkal
- Published On : October 26, 2022 / 07:36 PM IST
Pakistan PM Shehbaz Sharif 's 1st visit to China next week
China Tour: ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్.. ప్రధాని హోదాలో మొదటిసారి చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆయన కలుసుకోనున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాంగిచడం, ప్రాంతీయ, ప్రపంచ పరిణామలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. షరీఫ్ పర్యటన చైనాలో రెండు రోజుల పాటు కొనసాగుతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం, రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేసినా డబ్బులు అడుగుతారని అనుకుంటున్నారని, ప్రపంచం ముందు పాకిస్తాన్ బిచ్చగాడిలా నిల్చోందని అన్నారు. ఈ తరుణంలో చైనా పర్యటన చాలా ఆసక్తిని రేపుతోంది.
నవంబర్ 1,2 తేదీల్లో పర్యటించనున్న షెహబాజ్ వెంట ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంటుంది. చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు షెహనాజ్ ఆదేశంలో పర్యటించున్నట్టు పాక్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే చైనా నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ 20వ సమావేశం ముగియడం, ఈ సమావేశంలో మరో ఐదేళ్లపాటు జిన్‌పింగ్‌కే అధికారం కట్టబెట్టడం వంటి పరిణామాల తర్వాత చైనాలో పర్యటించనున్న తొలి నాయకుడు షెహనాజ్ కానుండటం విశేషం.
Mayawati: మదర్సాల్లోని విద్యార్థులను డ్రైవర్లను, మెకానిక్‌లను చేసింది కాంగ్రెసే.. మండిపడ్డ మాయావతి
