పాకిస్తాన్ చారిటీ పేద ముస్లింల కోసం సరికొత్త విందును ఏర్పాటు చేసింది. కరాచీ ప్రాంతంలో ఉండే ముస్లింలకు ఆస్ట్రిచ్(నిప్పుకోడి)మాంసాన్ని ఆహారం ఇఫ్తార్ విందులో ఇస్తుందట. అత్యంత ఖరీదుగా భావించే ఆస్ట్రిచ్ మాంసం రంజాన్ పవిత్ర మాసంలో పేదలకు సైతం అందాలనే ఆలోచనతో ఇలా చేస్తుందట.
వందలసంఖ్యలో వాలంటీర్లు పాల్గొని ఆ మాంసంతో చేసిన కూరను 500మంది ఇళ్లకు పంపిణీ చేశారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష ముగించే ఆహారంలో ఇది కూడా చేరింది. జఫారియా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. ధనిక కుటుంబాల చొరవతో మధ్య తరగతి, పేద వారికి సైతం ఈ ఆహారం చేరుతుంది.
మేనేజ్‌మెంట్ అధికార ప్రతినిధి తెలిపిన జాఫర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ‘ఆర్థిక స్తోమత లేనివారు ఒంటరిగా మిగిలిపోకుండా వారికి సైతం అదే ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో దుప్పి వంటి ఖరీదైన జంతుమాంసాలను కూడా అందించనున్నాం’ అని తెలిపారు.
ఇటువంటి ఆహారాలు భారతదేశంలో నిషేదమైనప్పటికీ పాకిస్తాన్‌లో ఆమోదయోగ్యమే.