50వసారి నింగికెగరనున్న PSLV

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌(పీఎస్ఎల్వీ) 50వ విమానాన్ని లాంచ్ చేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సిద్ధమైంది. మూడు దశాబ్దాల కృషితో డిసెంబరు 11న పీఎస్ఎల్వీ-48విమానం లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. 

ఇప్పటివరకూ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి 49పీఎస్ఎల్వీ మెషీన్లు లాంచ్ అయ్యాయి. వాటిలో మూడు డెవలప్ మెంట్ విమానాలు కూడా ఉన్నాయి. పీఎస్ఎల్వీ డీ1, డీ2, డీ3తో పాటు మరో 46ఆపరేషనల్ ఫ్లైట్స్. ఈ మొత్తంలో ఫైయిలైంది 2మాత్రమే. 

ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా జీఎస్ఎల్వీ (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)తో సమాంతరంగానే పీఎస్ఎల్వీ ప్రయోగాలు నిర్వహించారు. మూడు దశాబ్దాల కృషితో 45విమానాలను ప్రయోగించారు. వీటిలో ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్ 1, మార్స్ ఆర్బిటార్ మిషన్(మంగళయాన్)వంటి స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగాలు కూడా ఉన్నాయి. 

పీఎస్ఎల్వీ సీ37మిషన్ 104శాటిలైట్లను ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సహాయపడి రికార్డు సాధించింది. ఇక 50వ ఫ్లైట్ అంతరిక్షంలోకి పది శాటిలైట్లను తీసుకుపోనుంది. వాటిలో రిశాట్-2బీఆర్1తో పాటుగా తొమ్మిది చిన్నపాటి శాటిలైట్లు ఉండనున్నాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీల తర్వాత  పీఎస్ఎల్వీ అనేది ఇస్రో థర్డ్ జనరేషన్ ఫ్లైట్ అని తెలిపారు.