woman Married Her Son : 8 ఏళ్ల పిల్లాడ్ని తెచ్చుకుని పెంచి పెళ్లి చేసుకున్న మహిళ

8 ఏళ్లు ఉన్న బాలుడ్ని తెచ్చుకుని 14 ఏళ్లు పెంచి పెద్ద చేసింది. అతనికి 22 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్న మహిళ ఘటన షాక్ గురి చేసింది.

woman Married Her Son : 8 ఏళ్ల పిల్లాడ్ని తెచ్చుకుని పెంచి పెళ్లి చేసుకున్న మహిళ

Woman marries adopted son

53 Years Old woman Married Her 22 Years Son : పిల్లలు లేని దంపతులు బంధువుల పిల్లల్ని లేదా అనాథ పిల్లల్ని చేరదీసి పెంచుకుంటారు. దత్తత చేసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వారిని పెంచి పెద్ద చేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం తను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్లాడు యువకుడు అయ్యాక అతనినే పెళ్లి చేసుకుంది. వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.. సాధారణంగా చిన్నప్పటినుంచి పెంచిన పిల్లలపై వాత్సల్యం కలుగుతుంది. మాతృత్వపు ప్రేమ కలుగుతుంది. కానీ ఈమె మాత్రం ఫుల్ డిఫరెంట్. 8 ఏళ్లు ఉన్న ఓ బాలుడ్ని తెచ్చుకుని పెంచి పెద్ద చేసింది. అతనికి 22 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంది.

రష్యాలోని టాటర్ స్థాన్ కు చెందిన ఐసీలు చిజెవ్‌స్కాయా -మింగలిమ్ అనే మహిళ తాను పెంచి పెద్ద చేసిన కొడుకునే వివాహం చేసుకున్న ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మ్యూజిక్ షోలు ఇచ్చే ఆమె ఓఅనాథాశ్రమంలో పిల్లలకు మ్యూజిక్ నేర్పేందుకు వెళ్లేది. అక్కడ డేనియల్ అనే 8 ఏళ్ల పిల్లాడు సంగీతం పట్ల ఆసక్తి చూపించటంతో ప్రత్యేక శ్రద్ధతో నేర్పేది. అలా ఆమెకు ఓ పిల్లాడు నచ్చాడు. దీంతో అనాథ ఆశ్రమం నిర్వాహకులతో మాట్లాడి ఫార్మిలిటీస్ పూర్తి చేసుకుని దత్తత చేసుకుంది.

fasting : 110 రోజులు కఠిన ఉపవాసం చేసిన బాలిక .. ఎందుకో తెలుసా..?

అలా ఆ ఎనిమిదేళ్ల క్రితం ఓ పిల్లాడిని తెచ్చి  14 ఏళ్లు పెంచింది. అతనికి 22 ఏళ్ల వచ్చాయి. ఆమెకు 53 ఏళ్లు. ఐసీలు ట్రైనింగ్ లో సంగీతంపై మంచి పట్టు సాధించిన డేనియల్ పలు మ్యూజిక్ షోలు ఇచ్చాడు. అలా వారి జీవితం కొనసాగుతున్న క్రమంలో ఆమెకు ఆ పిల్లాడిపై మనసు మళ్లింది. విచిత్రంగా అతనికి కూడా ఆమె అంటే ఇష్టం కలిగింది. దీంతో ఇద్దరు అక్టోబర్ (2023) 20 టాటర్ స్థాన్ రిజబ్లిక్ లోని కజాన్ లోని ఓ రెస్టారెంట్ లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్యా 31 ఏళ్ల వయస్సు తేడా. అయినా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం విషయం తెలిసి సదరు అనాథాశ్రహం నిర్వాహకులు షాక్ అయ్యారు. డేనియల్ తరువాత ఐసీలు చిజెవ్ స్కాయా మరో నలుగురు ఆడపిల్లల్ని,ఒక అబ్బాయిని తీసుకెళ్లిన పిల్లల్ని తిరిగి తీసుకెళ్లిపోవటానికి సదరు ఆశ్రమం నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.దీంతో పిల్లల్ని తీసుకెళ్లేందుకు వారు తీసుకునే చర్యలపై ఐసీలు మండిపడుతోంది. ఆ పిల్లల్ని తీసుకుని మాస్కో వెళ్లిపోవాలనుకుంటోంది. మరి ఏం జరుగనుందో..

Mini Pink Bullet : బుల్లి బుల్లెట్ బండి భలే ఉందే .. !!