Kazakhstan : నిరసనకారులను కాల్చి పారేయండి..పోలీసులకు ఆదేశాలు

వరైనా నిరసన తెలియజేస్తున్నట్లు కనిపిస్తే కాల్చిపారేయండంటూ ఆదేశాలు జారీ చేశారు ఆ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్. రాజ్యాంగాన్ని పునరుద్ధరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

Kazakhstan

Kazakhstan Shoot To Kill : కజఖిస్థాన్‌ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. నిరసన కారులను కాల్చి చంపాలని పోలీసులను ఆదేశించారు. ఎల్పీజీ (LPG) ధరల పెంపుపై కజఖిస్థాన్‌లోని అల్మాటీ నగరంలో పెల్లుబికిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ..ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఎవరైనా నిరసన తెలియజేస్తున్నట్లు కనిపిస్తే కాల్చిపారేయండంటూ ఆదేశాలు జారీ చేశారు ఆ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్. రాజ్యాంగాన్ని పునరుద్ధరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read More : Maharashtra : మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం…93 మంది పోలీసులకు పాజిటివ్

జాతినుద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు….కొందరు ఉగ్రవాదులు నిరసనలు తెలుపుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికే 3 వేల మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అల్మాటీలోని 70 చెక్‌పాయింట్ల వద్ద పోలీసులు నిత్యం గస్తీ కాస్తున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలను నిరసనకారులు కూల్చేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రజలు సహా 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

Read More : Science Journal : షాకింగ్ న్యూస్..ఇండియాలో 32 లక్షల కరోనా మరణాలు!

వందల సంఖ్యలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ పోలీసు తలను నిరసనకారులు నరికివేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వేల సంఖ్యలో వాహనాలను దగ్ధం చేసినట్లు తెలిపారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న అశాంతిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను సమకూర్చాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఖాసిమ్.. రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌కి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన రష్యా కజఖిస్థాన్‌కు భద్రతా బలగాలను పంపించినట్లు సమాచారం.