Trump Own Platform: సొంత ప్లాట్‌ఫాంతో సోషల్ మీడియాలోకి ట్రంప్ రీఎంట్రీ

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు సస్పెండ్ చేశాయి. జనవరి 6న క్యాపిటల్ దాడులపై రియాక్షన్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

TRUMP SOCIAL MEDIA: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు సస్పెండ్ చేశాయి. జనవరి 6న క్యాపిటల్ దాడులపై రియాక్షన్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ట్విట్టర్ 28శాతం షేర్ వాల్యూను కూడా పోగొట్టుకుంది. అదలా ఉంటే.. ట్రంప్ సొంతగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకుని రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.

రెండు మూడు నెలల్లో సిద్ధమవనున్నట్లు సీనియర్ అడ్వైజర్లు మీడియాకు వెల్లడించారు. జాసన్ మిల్లర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా స్పేస్ లోకి కొత్త ప్లాట్ ఫాం ద్వారా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాం. ఇది పూర్తిగా రీ డిఫైన్ గేమ్ అని వెల్లడించారు. ట్రంప్ ఆర్గనైజేషన్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. కేవలం ప్రకటనతోనే ఆపేశారు.

పబ్లిక్ ఇంటరస్ట్‌తో వరల్డ్ లీడర్స్‌ను కూడా బ్యాన్ చేస్తామని గత వారం ట్విట్టర్ వెల్లడించింది. ఇది రివ్యూ పాలసీ అని.. లీడర్స్ కూడా ఇతర యూజర్లకు మాదిరి రూల్స్ నే కచ్చితంగా ఫాలో కావాలనే ఇది పెట్టినట్లు చెప్పారు.

ట్విట్టర్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అకౌంట్లు బ్లాక్ చేసినందుకు కాస్త ఆగ్రహానికి లోనయ్యాయి. హింసాపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణంతో ట్రంప్ ను జనవరిలో ఫేస్ బుక్ కూడా బ్యాన్ చేసింది. ఇలా నిషేదం కొనసాగిస్తుండటంతో ఆయనే సొంతగా ప్లాట్ ఫాం క్రియేట్ చేసుకుని రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు