Iran vs Israel War : ఇరాన్ 10 షరతులు ఇవే.. ట్రంప్ అంగీకరిస్తారా.. యుద్ధం పూర్తిగా ఆగినట్లేనా..!
Iran vs Israel War : ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న వార్‌కు తాత్కాలిక విరామం లభించింది. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Iran vs Israel War
- డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
- రెండు వారాలపాటు కాల్పుల విరమణ
- అమెరికా ముందు 10 సూత్రాలు ఉంచిన ఇరాన్
Iran vs Israel War : ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న వార్‌కు తాత్కాలిక విరామం లభించింది. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాలపాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ప్రపంచం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంది.
Also Read : Iran vs Israel War : యుద్ధంపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్! హర్ముజ్ జలసంధికి లైన్ క్లియర్!
హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు తాత్కాలికంగా రెండు వారాలపాటు వార్ నిలిపివేస్తున్నామని, శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఇరాన్ 10 సూత్రాల ఫార్ములాను అమెరికా ముందు ఉంచింది.
ఇరాన్ పంపిన 10 సూత్రాల ఫార్ములా సానుకూలంగానే ఉందని ట్రంప్ ప్రకటించారు. శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ 10 సూత్రాలు ఇవే..
1. ఇరాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్ వంటి అన్ని దేశాలపై తక్షణమే, శాశ్వతంగా దాడులను నిలిపివేయాలి.
2. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తక్షణమే వాణిజ్య నౌకల కోసం తెరవడం. అయితే, ఇరాన్ సైన్యం నియంత్రణలో అది ఉండాలనే షరతు.
3. జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రత, స్వేచ్ఛా రవాణా కోసం ఇరాన్ సైనిక పర్యవేక్షణతో ఒక కొత్త ప్రొటోకాల్ ను ఏర్పాటు చేయాలి.
4. జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకపై సుమారు 2మిలియన్ డాలర్లు రుసుమును విధించాలి. ఈ ఆదాయాన్ని ఒమన్ తో పంచుకోవడమే కాకుండా, యుద్ధంతో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పున:నిర్మాణానికి ఉపయోగించాలి.
5. ఇరాన్ తన పౌర అవసరాల కోసం జరుపుతున్న యురేనియం సుసంపన్నత హక్కును అమెరికా, ఇతర దేశాలు గుర్తించాలి.
6. ఇరాన్ పై ఉన్న ప్రాథమిక, ద్వితీయ ఆర్థిక ఆంక్షలన్నీ పూర్తిగా తొలగించాలి.
7. అమెరికా, ఇరత దేశాల్లో ఉన్న ఇరాన్ నిధులను, ఆస్తులను తక్షణమే విడుదల చేయాలి.
8. యుద్ధం కారణంగా జరిగిన విధ్వంసానికిగాను ఇరాన్ కు పూర్తి స్థాయిలో పున:నిర్మాణ ఖర్చులు లేదా నష్టం పరిహారం చెల్లించాలి.
9. పశ్చిమాసియాలోని ప్రాంతీయ స్థావరాల నుండి అమెరికా తన పోరాట దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి.
10 . ఈ పది సూత్రాలతో కూడిన ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించాలి. తద్వారా ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం పక్కాగా అమలు కావాలి.
