Viral Video: స్టేజీపై బొక్కబోర్లా పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
ఈ ఘటనపై బైడెన్ నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. పడిపోయిన వెంటనే తనకు ఏదో తగిలిందని, తాను అందులో పడిపయినట్లు నవ్వుతూ చెప్పారు. ఇక సాయంత్రం వైట్ హౌస్‌కి తిరిగి వచ్చినప్పుడు జాగింగ్ చేస్తున్నట్లు నటించి, పడిపోయిన ఘటనకు సంబంధించిన అవమానాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
- tony bekkal
- Updated on- June 2, 2023 / 11:02 AM IST
USA: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కసారిగా కింద పడిపోయారు. ఒక కార్యక్రమంలో స్టేజీపై నిల్చున్న ఆయన పక్కకు కదులుతున్న క్రమంలో ఒక్కసారిగా బొక్కబోర్లా పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి గ్రాడ్యుయేషన్ వేడుక నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బైడెన్ హాజరయ్యారు. అయితే గ్రాడ్యుయేట్లకు డిప్లొమాలు అందజేస్తున్న సమయంలో బైడెన్ కాలుజారి వేదికపై పడిపోయారు.
Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం
అక్కడే ఉన్న ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పైకి లేపారు. అనంతరం, అక్కడే తిగిలినట్లు ఆయన వారికి చూపించడం వీడియోలో చూడొచ్చు. ఆయనకేమీ కాలేదని, బాగానే ఉన్నారని ఈ ఘటన జరిగిన కొద్ది సమయం తర్వాత అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ తెలిపింది. ఆ ఘటనను బైడెన్ సరదాగా తీసుకున్నారని సైతం పేర్కొంది.
అయితే ఈ ఘటనపై బైడెన్ నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. పడిపోయిన వెంటనే తనకు ఏదో తగిలిందని, తాను అందులో పడిపయినట్లు నవ్వుతూ చెప్పారు. ఇక సాయంత్రం వైట్ హౌస్‌కి తిరిగి వచ్చినప్పుడు జాగింగ్ చేస్తున్నట్లు నటించి, పడిపోయిన ఘటనకు సంబంధించిన అవమానాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
