ఓ భర్త వీర ప్రేమగాథ: భార్య శవం పక్కనే నిద్ర..నేను చచ్చే వరకూ ఇంతే..

  • Publish Date - February 10, 2020 / 10:00 AM IST

భార్య చనిపోయినా 16 సంవత్సరాలుగా ఆమెతోనే జీవిస్తున్న ఓ భర్త వీర ప్రేమ కథ తెలుసుకుంటూ గుండెలుబరువెక్కుతాయి. ఎన్నో కారణాలతో భార్యకు హింసించే భర్తలున్న రోజుల్లో భార్య చనిపోయినా..ఆమెతోనే నా జీవితం అంటూ ఆమె కోసం పరితపించిపోతున్న ఓ భర్త వాస్తవిక కథ గురించి తెలుసుకున్నవారంతా..కన్నీరు పెట్టుకుంటున్నారు. చనిపోయిన ఆమె అతని ప్రేమ పొందలేని దురదృష్టవంతురాలా? లేక అంతగా ప్రేమించే భర్త దొరికిన ఆమె అదృష్టవంతురాలా? అనుకుంటున్నారు. 

వివరాల్లోకి వెళితే..వియత్నాంకు చెందిన లీ వ్యాన్‌ 1975లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరి ప్రేమకు ప్రతిఫలంగా ఏడుగురు పిల్లు పుట్టారు. అయినా వారి అన్యోన్యతలో ఏమాత్రం మార్పురాలేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. కానీ..వంచింది. సైన్యంలో పనిచేసే లీకి భార్య చనిపోయిందనే వార్త విన్న లీ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. 

ఆమెను చూసేందుకు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి బయల్దేరాడు లీ.లేట్ అయితే మృతదేహం పాడవుతుందనే బంధువులు స్మశానంలో పాతిపెట్టారు. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక లీ పిల్లలతో సహా అందరూ ఇంటికి వచ్చేశారు. కానీ లీ మాత్రం స్మశానంలోనే ఉండిపోయాడు. భార్య సమాధి పక్కనే ఆ రాత్రి నిద్రపోయాడు. భార్య జ్నాపకాలతో అల్లాడిపోయాడు. 

అలా ఒకరోజు రెండు రోజులు కాదు నెలల తరబడి లీ భార్యను సమాధి పక్కనే పడుకునేవాడు. పిల్లలు ఎంతగా చెప్పినా లీ వినేవాడు కాదు. ఓ రోజు వర్షం వచ్చింది. సమాధి వద్ద నిద్రపోలేకపోయాడు. దీంతో ఓ ఆలోచన వచ్చింది. సమాధి పక్కనే ఓ సొరంగం తవ్వాడు. ఆమెకు దగ్గరగా పడుకున్నాడు. ఆ విషయం లీ పిల్లలు తెలుసుకున్నారు. అమ్మ చనిపోయింది నాన్నా..నువ్వలా చేయకూడదని పదే పదే చెప్పారు. వినలేదు. చివాట్లు పెట్టి ఇంటికి  లాక్కెళ్లిపోయారు.  కానీ, లీ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

నిద్రపట్టక.. సమాధి తవ్వి..అస్థికలు వెలికి తీసి..
భార్య లేని ఇంట్లో లీ ఒంటరిగా ఉండలేకపోయాడు. నిద్రపట్టటం లేదు..తిండి తినటంలేదు. దీంతో స్మశానంలోకి వెళ్లి ఆమె సమాధిని తవ్వాడు. ఆమె అస్థికలను (కుళ్లిపోయిన మృతదేహం) ఓ సంచిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చీ..తన పడక గదిలో పెట్టుకుని నిద్రపోయాడు. ఆమె అస్థికలు కుళ్లిన స్థితిలో ఉండటంతో.. వాటిని చూడలేక మదన పడ్డాడు. ఏడ్చాడు. కానీ కుళ్లిపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికల్ని పాతిపెట్టటానికి మనస్సొప్పలేదు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో లీ ఓ మహిళ బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మలో భార్య అస్థికల్ని ఉంచాడు. 

 

పోలీసులు చెప్పినా వినని లీ వ్యాన్
అప్పటి నుంచి ఆ బొమ్మనే తన భార్యగా భావిస్తూ నిద్రపోయేవాడు. నిద్ర మధ్యలో మెలకువ వచ్చిన తన భార్యను ఎవరైనా తీసుకుపోతారేమోనని లేచి కూర్చునేవాడు. అలా ఆ బొమ్మవంక చూస్తు తెల్లవార్లు కూర్చుండిపోయేవాడు. ఈ విషయం తెలిసి.. అతడి పిల్లలు లీతో పెద్ద గొడవ పడ్డారు. తమ తల్లి అస్థికలను స్మశానంలోనే ఉంచాలని, లేకపోతే ఆమె ఆత్మకు శాంతి కలగదని నెత్తీ నోరూ కొట్టుకుని వాదించారు. కానీ, లీ మాత్రం ఏమాత్రం వినలేదు. దీంతో పోలీసులకు చెప్పటంతో రంగంలోకి దిగిన పోలీసులు లీకి శతవిధాలా చెప్పి చూశారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ లీలో మాత్రం మార్పు రాలేదు. ఇది అతని మానసిక సమస్య అని చెప్పి పోలీసులు వెళ్లిపోయాడు. 

ప్రతీ రోజూ బొమ్మకు మేకప్ వేస్తూ.. బట్టలు మారుస్తూ..
లీ భార్యగా భావించే ఆ బొమ్మను మనిషిలాగనే ప్రతీరోజూ శుభ్రం చేచేసి, దుస్తులు మారుస్తాడు. అందంగా మేకప్ వేస్తాడు. కానీ..కొన్నాళ్లుగా లీ నడవలేక వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యాడు.అయినా..ఆ బొమ్మను మాత్రం వదలటంలేదు. 

నా బ్రతుకంతా ఆమెతోనే..నేను చచ్చేవరకూ ఆమెతోనే 
ఈ సందర్భంగా లీ వ్యాన్‌ మాట్లాడుతూ..నేను చనిపోయేవరకు ఆమె శవంతోనే జీవిస్తానని స్పష్టంగా..దృఢంగా చెప్పాడు. నా భార్య బతికి ఉన్నప్పుడు ఆమెకు  మంచి బట్టలు కూడా కొనలేకపోయా..కానీ ఎప్పుడూ ఆమె నోరు తెరిచి నాకు మంచి బట్టలు కావాలని అడలేదని కన్నీరు కారుస్తు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే, ఇప్పుడు ఆమె కోసం ఎన్నో కొత్త బట్టలు కొన్నాను. నా భార్య మృతదేహాన్ని జాగ్రత్తగా చూస్తున్నందుకు జనాలంతా నన్ను వింతగా చూస్తున్నారు. పిచ్చివాడనుకుంటున్నారు. అనుకున్నా నాకేం బాధలేదు. ఆమె ఎప్పుడూ నాతోనే ఉందని నా నమ్మకం. నేను చనిపోయేవరకు ఆమె శవంతోనే (అస్థికలు ఉన్న బొమ్మ)తోనే జీవిస్తాను అని తెలిపాడు. ఇది కథలా ఉన్నా..స్వచ్ఛమైన ప్రేమకు లీ గొప్ప నిదర్శనం అని మాత్రం చెప్పక తప్పదు.]

Read More>>మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ : కొత్తగా ప్రమాణ స్వీకారం ,కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం