Delhi Capitals chose to bat in Qualifier 2 : ఐపీఎల్ 2020 సీజన్ మరో కీలక మ్యాచ్.. క్వాలిఫైయర్-2 ఆడేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయ్యాయి. అబుదాబి వేదికగా క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ కీలక మ్యాచ్ ఇరు జట్లకు చావోరేవో లాంటిది.. ఫైనల్ బెర్త్ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్.. ఎవరూ ఓడినా ఇంటికే.. అందుకే సన్ రైజర్స్, ఢిల్లీ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు 17 సార్లు తలపడ్డాయి. హైదరాబాద్ 11 సార్లు గెలిచింది.. ఇక ఢిల్లీ జట్టు 6 సార్లు గెలిచింది.. లీగ్ దశ మ్యాచ్ల అనంతరం పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ల్లో 8 గెలిచి.. మరో 6 మ్యాచ్ ల్లో ఓడింది. హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3 స్థానంలో ఉంది.
14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ లు గెలిచి.. మరో 7 మ్యాచ్ ల్లో ఓడింది. ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లో నెగ్గడం ఇరుజట్లకు ఎంతో కీలకం.. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో కనిపిస్తున్నాయి. ఈ కీలక పోరులో ఎవరూ ఫైనల్ కు వెళ్తారో ఎవరూ ఇంటికి వెళ్తారో చూడాలి.
సన్ రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శ్రీవత్స్ గోస్వామి (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియంగార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి.నటరాజన్.
ఢిల్లీ క్యాపిటల్స్ :
: శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, హర్షల్ పటేల్, మార్కుస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, ప్రవీణ్ దుబే, అన్రిన్ నార్జీ, కాగిసో రబడ.
#DelhiCapitals have won the toss and they will bat first against #SRH in #Qualifier2 of #Dream11IPL pic.twitter.com/vtbHRScGeI
— IndianPremierLeague (@IPL) November 8, 2020