IPL 2020 : Chennai Super Kings అంటేనే match-winners. మూడు IPL గెల్చారంటేనే ప్రూఫ్. అలాగని ఎవరూ కుర్రాళ్లుకాదు. వెటరన్స్. 35 ఏళ్లుదాటిన ప్లేయర్లతో ఈసారి మళ్లీ కప్ గెలవగలదా? ధోనీ కుర్ర ప్లేయర్లను ఎంతలా నమ్ముతాడో, సీనియర్ ప్లేయర్స్‌కి అంతే ప్రయార్టీ ఇస్తాడు. ఉత్సాహం, అనుభవం మధ్య సమతూకమే ధోనీ సక్సెస్ సీక్రెట్.
Ravichandran Ashwinకి బదులుగా Piyush Chawla ధోనీ తీసుకున్నాడు. రూ. 6.5 కోట్లు పెట్టాడు. చావ్లాకున్న ఐపీఎల్ అనుభవానికి ఇది తగిన గుర్తింపు. అంటే Chennai Super Kingsలో ఐదో అత్యధిక విలువున్న ఆటగాడు.
Chennai Super Kings IPL 2020 UAE: ముంబైను భయపెట్టే చెన్నై ఆటగాళ్లు
Suresh Raina, Harbhajan Singhలు జట్టులో లేకపోవడం ధోనీకున్న పెద్ద ఇబ్బంది. ఒకరు పరుగుల యంత్రం. ఇంకొకరు పెద్దగా పరుగులివ్వకుండా ప్రత్యర్ధిని కట్టిడిచేసే స్పిన్నర్. ఇప్పుడు వీళ్లద్దరినీ రిప్లేస్ చేసే ఆటగాళ్లు మాత్రమేకాదు, ఒంటిచేత్తో గెలిపించే ప్లేయర్లు చెన్నైకున్నారు.
1. MS Dhoni
చెన్నైకి దత్తపుత్రుడు. మూడుసార్లు టైటిల్ గెల్చాడు. మరోమూడుసార్లు ఫైనల్స్‌లో ఓడిపోయాడు. అతని బ్యాటింగ్..పిచ్ మీద పెద్ద కోట. 190 IPL matchesలో మొత్తంమీద 4432 రన్స్ చేశాడు. రెండురోజుల క్రితమే ప్రాక్టీస్‌లో సిక్స్‌లమీద సిక్స్‌లు కొడుతుంటే చూసినవాళ్లు అదిరిపోయారు.
2. Sam Curran
ఈ 21 ఏళ్ల కుర్రాడిమీద ధోనీ డబ్బు బాగా పెట్టాడు. ఈ ఆల్‌రౌండర్ యార్కర్లు వికెట్లను తీయగలవని నమ్ముతున్నాడు. అతని బ్యాంటింగ్‌కు తిరుగులేదు. మిడిల్ ఆర్డర్ లో మ్యాచ్ ను నడిపించగలడు. ఒక వేళ టాప్‌ఆర్డర్ క్లిక్ కాకపోతే ధోనీ ఉంటాడు. అతని తర్వాత Curran వస్తాడు. రన్స్ కొట్టగలడు. 2019లో Kings XI Punjab తరుపున ఆడాడు. 10 వికెట్లు తీశాడు. 95 రన్స్ చేశాడు. అందుకే వేలంలోరూ. 5.5 కోట్లు పలికాడు.
3. Shane Watson
రెండుసార్లు player of the tournament award విన్నర్. రిటైర్డ్ అయిన షేన్, ధోనీతోపాటు 35 ఏళ్లు దాటినవాడే.కాకపోతే క్లిక్ ఐతే అతని బ్యాటింగ్ ఎలాగుంటుందో అందరికీ తెలుసు. తనరోజు వచ్చిదంటే…వంటిచేత్తో జట్టును గెలిపించగలడు. ఆ సంగతి ధోనీకి బాగా తెలుసు. అందుకే వాట్సన్ అంటే అంత ఇష్టం.
4. Imran Tahir
పాకిస్థాన్ మీద ఆడుతున్నప్పుడు దుబాయ్‌లో బంతికి బాగా తిప్పాడు. ఏజ్ 40. ఇదో నెంబర్ మాత్రమే. ఇప్పటికీ ఫీల్డ్‌లో చిచ్చరపిడుగు. బౌలింగ్ చేస్తున్నప్పుడు అదే ఫైర్. 2019లో 26 వికెట్లు తీశాడు. ఈసారి వికెట్ల నెంబర్ అంతకన్నా తగ్గదు.
5. Dwayne Bravo
ఈ స్టార్ ఆల్ రౌండర్ స్లోబాల్స్‌తో వికెట్లు తీస్తాడు. ఓవర్‌కి రెండు మూడు సిక్సర్లు కొట్టగలడు. చెన్నై ఓడిపోతుందనుకున్న చాలాసార్లు మనోడే గెలిపించాడు. ధోనీ తర్వాత చెన్నైలో అత్యంత విలువైన ఆటగాడు. చెన్నైలో మనోడికి విపరీతమైన ఫాలోయింగ్.