IPL 2021: అందరూ ఒకటే.. ఎవరున్నా.. లేకున్నా ఐపీఎల్ ఆగదు – బీసీసీఐ

లీగ్‌ నుంచి ఇండియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు..

Ashwin Takes Break From Ipl 2021 To Support His Family In Covid 19 Crisis

IPL 2021: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కో రోజు లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లీగ్‌ నుంచి ఇండియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం లీగ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు.

తాజా పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. లీగ్‌ నుంచి నిష్క్రమణలు ఉన్నా, ఐపీఎల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. తన కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతుండటంతో వారికి అండగా ఉండేందుకు సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్‌ తెలిపాడు.

ఆండ్రూ టై(రాజస్థాన్‌), కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా(రాయల్‌ ఛాలెంజర్స్‌)లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ‘ప్రస్తుతం ఐపీఎల్‌ లీగ్‌ కొనసాగుతుంది. ఎవరైనా లీగ్‌ నుంచి తప్పుకోవాలనుకుంటే మంచిదే’అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ తెలిపాయి. భారత్‌ నుంచి వచ్చే సమాచారాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం 14 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఉన్నారు. లీగ్‌ అయిపోయిన వెంటనే ప్రత్యేక విమానంలో వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 30వ తేదీ వరకూ ఐపీఎల్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే.