Ipl 2021 Chennai Super Kings Need 172 Runs To Win
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో 23వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా 3వికెట్లు నష్టపోయి సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు 172 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు.
కెప్టెన్ డేవిడ్ వార్నర్(57: 55 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), మనీశ్ పాండే(61: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో స్కోరు బోర్డు ఊపందుకుంది. ఇన్నింగ్స్ చివర్లో కేన్ విలియమ్సన్(26 నాటౌట్: 10 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) మెరుపులకు కేదార్ జాదవ్(12 నాటౌట్: 4 బంతుల్లో ఫోర్, సిక్స్) తోడై చివరి ఓవర్లో 13పరుగుల స్కోరు రాబట్టగలిగారు.
ఢిల్లీ బౌలర్లు ఎంగిడీ 2, శామ్ కరన్ 1వికెట్ తీయగలిగారు. అంతకంటే ముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.