Gujarat,Himachal Pradesh Elections 2022 : గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని ప్రకటించనున్న ఈసీ

గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించనుంది ఈసీ.

Gujarat,Himachal Pradesh : గుజరాత్,హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ కు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల తేదీని శుక్రవారం (అక్టోబర్ 14,2022) మధ్యాహ్నాం 3గంటలకు ఈసీ ప్రకటించనుంది. ఈసీ ప్రకటనతో ఇక రెండు రాష్ట్రాల్లోనే ఎన్నికల హడావిడి షురూకానుంది. ఇప్పటికే గుజరాత్‌లో అధికారం కోసం ఆప్ చీఫ్..ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ గుజరాత్ లో పలుమార్లు పర్యటించారు. ఢిల్లీలో ప్రారంభమైన ఆప్ ప్రస్థానం పంజాబ్ లో కూడా అధికారాన్ని దక్కించుకుని గుజరాత్ లో కూడా పాగా వేయాలని యత్నిస్తోంది. దీంట్లో భాగంగాకేజ్రీవాల్ గుజరాత్ ప్రజలకు పలు హామీలు ప్రకటించారు.

గుజరాత్ లో 182 స్థానాలకు 2022 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2017లో గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధించగా..కాంగ్రెస్ 77సీట్లు గెలుచుకుంది. ఆప్ పార్టీకి సీట్లేమీ దక్కలేదు. గుజరాత్ లో బీజేపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. ఈక్రమంలో ఆప్ 2022 ఎన్నికల్లో అయినా అధికారం దక్కించుకోవాలని ఇప్పటికే చర్యలు కొనసాగిస్తోంది. 2024లో ప్రధాని మోడీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుని మరోసారి అధికారంలోకి రావాలంటే గుజరాత్ లో బీజేపీ విజయం చాలా అవసరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో మ్ ఆద్మీ పార్టీ(AAP) మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. కొద్ది నెలల క్రితం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆప్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. పంజాబ్ లో ఘన విజయం సాధించిన ఆప్.. 2022 చివర్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి అధికారం చేపట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పలుసార్లు కేజ్రీవాల్ సహా ఆప్ ముఖ్యనేతలు తరచూ గుజరాత్ లో పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపడమే కాకుండా గుజరాత్ లోని అన్ని వర్గాల ప్రజలను తమవైపు తిప్పుకునేలా హామీలు గుప్పిస్తున్నారు. గుజరాత్ లో ఆప్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో మాదిరి గుజరాత్ లో మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ లు ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు హామీనిస్తున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ప్రజలకు గ్యారెంటి ఇస్తామని, ఉచితంగా వీటిని ప్రజలు పొందే విధంగా తాము చూస్తామంటూ హామీలు ఇస్తున్నారు.


								

ట్రెండింగ్ వార్తలు