48 అడుగుల ‘రామసేతు’ కేక్…రామాయణంలో వానరాలు నిర్మించినట్లే ఉంది..!!

48 feet long ram setu cake : చాక్లెట్ కేక్..వెనీలా కేక్, ఫ్రూట్ కేక్ ఇలా ఎన్నో రకాల కేకులు చూసి ఉంటారు. తిని కూడా ఉంటారు. ‘‘రామసేతు కేక్’’ గురించి విన్నారా? రామ సేతు. త్రేతాయుగంలో లంకాధీసుడు రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోతే..ఆమెను తీసుకురావటానికి శ్రీరాముడు వానరాల సహాయంతో ఈ ‘రామసేతు’ని నిర్మించి రావణుడుని చంపి సీతమ్మను రక్షించారని రామాయణం చెబుతోంది. ఆనాడు నిర్మించిన ఆ రామసేతు ఈనాటికి చెక్కు చెదరకుండా సముద్రంలో ఉండటం విశేషం.

 

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం అచ్చంగా ‘రామసేతు’లాంటి భారీ కేకును తయారు చేసింది గుజరాత్‌లోని ఓ బేకరీ సంస్థ. అచ్చం ఆనాటి రామసేతు ఎలా ఉందో అచ్చం అలానే తయారుచేయం విశేషం. ఈ రామసేతు నిర్మించటానికి ఉపయోగించిన బండరాళ్ల మీద ఆనాటి వానరాలు ‘శ్రీరామ్’ అని రాసినట్లుగానే ఈ రామసేతు కేకును తయారు చేయటం మరో విశేషం..!

గుజరాత్‌లోని ఓ బేకరీ సంస్థ రామసేతు రూపంలో 48 అడుగుల పొడవున్న ఈ కేక్‌ తయరు చేసింది. అచ్చంగా రామసేతు రూపంలో, వానరులు ఏర్పాటు చేసిన రాళ్లలా ఏర్పాటు చేశారు. వాటిపై ‘రామ్’ అని కూడా రాశారు. ఈ కేక్‌ను ప్రదర్శనకు ఉంచిన సదరు బేకరీ.. అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం కోసం రూ.1,01,111 తన వంతుగా అందజేసింది.

ఈ రామసేతు భారీ కేకును తయారు చేయటంపై బేకరీ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ..‘ప్రజలు రాముడి ఆలోచనలను పాటిస్తూ, ఆయనపై తమ ప్రేమను చూపించాలనేదే ఉద్ధేశ్యంతో ‘రామసేతు’కేకును తయారుచేశామని తెలిపారు.

కాగా..భారతదేశానికి ద్వీప దేశమైన శ్రీలంక మధ్యలో ఈ రామసేతు నిర్మాణం ఉంది. భారత్ లో ని తమిళనాడు ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన రామేశ్వం లోని పంబన్ ద్వీపానికి శ్రీలంక దేశానికి చెందిన మున్నర్ ద్వీపానికి మధ్య ఉంది.

హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగియుండే ఈ రామసేతు పొడవు 18 మైళ్ళు (అనగా 30 కిలోమీటర్లు). ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రామసేతుని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జి అంటారు.