ట్విట్టర్లో 6 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటిన రానా దగ్గుబాటి..
యువ హీరో రానా దగ్గుబాటి సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. తాజాగా రానా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది. ఈ సందర్భంగా రానా తన అభిమానులకు మరియు ట్విట్టర్ ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా అక్కినేని నాగార్జున కూడా 6 మిలియన్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే.
త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రియమణి, సాయి పల్లవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ‘అరణ్య’ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో త్వరలో విడుదల కానుంది.
Wow the Force in now 6 million!! Thank you ❤️
— Rana Daggubati (@RanaDaggubati) June 18, 2020