నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే : పవర్ స్టార్ పై ప్రగ్యా ప్రశంసలు

  • Publish Date - May 18, 2020 / 06:25 AM IST

నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే అంటూ అందం..నటన కలబోసిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపించింది. అందం, నటన..కలబోసిన ఈ అందాల బొమ్మకు మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. 
‘కంచె’ సినిమా తప్ప చెప్పుకోవటానికి పెద్దగా సినిమాల్లేని ప్రగ్యామాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీనే నా ఇల్లు అని చెప్పుకుంటుంది. 

ఈ క్రమంలో నెటిజిన్లతో కాసేపు ముచ్చటించిన ప్రగ్యా పవన్ స్టార్ పై ప్రశంసలు కురిస్తూ..నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాట్‌లో సమాధానమిచ్చింది. వీటిలో రెండు ప్రశ్నలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఒకటి మీకు ఇష్టమైన దర్శకుడు లేదా మీరు నటించాలని అనుకుంటున్న దర్శకుడు ఎవరు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ రాజమౌళి సార్,సంజయ్ లీలా భన్సాలీ సార్’ అని సమాధానమిచ్చింది.  రెండో ప్రశ్న : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక్క పదం చెప్పండి అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘నిజమైన నాయకుడు (ట్రూ లీడర్)’ అని ప్రగ్యా సమాధానమిచ్చింది. ఇంకేముందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగే చేసుకుంటున్నారు. కాగా చాలామంది సినీ నటుల్ని  నెటిజన్లు ఇదే ప్రశ్న వేస్తుంటారు. అలాగే ప్రగ్యానుకూడా అడగటంతో పవన్ గురించి తన అభిప్రాయాన్ని చక్కగా చెప్పింది ఈ అందాల నటి ప్రగ్యా. 

Read Here>>  ఆ నటుడిని చూసిన ప్రతిసారి నా ఒళ్లు గగుర్పొడుస్తుంది