Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతిని 2024లోపు రాష్ట్రాలు అమలు చేయకపోతే..: అమిత్ షా

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని 2024లోపు కొన్ని రాష్ట్రాలు అమలు చేసే వీలుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఒకవేళ ఆలోపు రాష్ట్రాలు ఆ పని చేయలేకపోతే 2024 తర్వాత తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక తామే యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని 2024లోపు కొన్ని రాష్ట్రాలు అమలు చేసే వీలుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఒకవేళ ఆలోపు రాష్ట్రాలు ఆ పని చేయలేకపోతే 2024 తర్వాత తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక తామే యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, సరైన సమయంలో దాన్ని అమలు చేయాలని రాజ్యాంగ పరిషత్ కూడా కూడా రాష్ట్ర అసెంబ్లీలకు, పార్లమెంటుకు సూచించిందని అమిత్ షా చెప్పారు. మతాల ప్రాతిపదికన చట్టాల రూపకల్పన జరగకూడదని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతికి బీజేపీ తప్ప ఏ ఇతర పార్టీ మద్దతు తెలపడం లేదని, దానికి అనుకూలంగా మాట్లాడడం లేదని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాలు యూసీసీపై ప్యానెల్ ను ఏర్పాటు చేశాయని, దాని అమలుపై సలహాలు, సూచనలు తీసుకుంటున్నాయని అమిత్ షా అన్నారు. తమకు వచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును, యూసీసీ అమలును పోల్చి చూడకూడదని ఆయన అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు