భారతదేశంలో 504 మిలియన్ల యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ (IAMAI) అధ్యయనం వెల్లడించింది. మొత్తం 70 శాతం మంది రోజువారీ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారని తెలిపింది. నవంబర్ 2019 నాటికి 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా పేర్కొంది. ఇంటర్నెట్ యూజర్లలో మొత్తం, 433 మిలియన్లు ఉండగా, వారిలో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారే ఉన్నారు.
5-11 సంవత్సరాల వయస్సు వారిలో 71 మిలియన్ల మంది ఉన్నారు. వీరు కుటుంబ సభ్యుల డివైజ్‌ల్లో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారని ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ అధ్యయనం తెలిపింది. భారతదేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు 70 శాతం మంది రోజువారీ వినియోగదారులు ఉన్నారు. దేశ నగర జనాభాలో 10 మంది ఇంటర్నెట్ వినియోగదారులలో తొమ్మిది మంది వారానికి ఒకసారి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు.
IRS డేటా ఆధారంగా నీల్సన్ అధ్యయనం ప్రకారం.. 2019 మార్చిలో పోలిస్తే.. గ్రామీణ భారతదేశంలో, రోజుకు 30 మిలియన్ల మంది కొత్త యూజర్లు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. మూడింట ఒక వంతు మంది వినియోగదారులు ఆదివారాలు సెలవు దినాలలో సాధారణ పని దినానికి ‘ఒక గంటకు పైగా’ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. మెరుగైన కనెక్టివిటీ, సర్వీసు క్వాలిటీ, మొబైల్ ఇంటర్నెట్, గ్రామీణ యూజర్లు భవిష్యత్తులో ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. 2019 నవంబర్‌లో 26 మిలియన్ల మంది కొత్త మహిళా ఇంటర్నెట్ యూజర్లు చేరారు. పురుష యూజర్లలో 9 శాతం పెరుగుదలతో పోలిస్తే.. 21శాతం పెరుగుదల ఉంది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఎంపిక చేసే డివైజ్ ఉంది. మొబైల్ డివైజ్ కలిగి ఉండి చౌకైన డేటా ప్లాన్ల లభ్యత దృష్ట్యా, మొబైల్ డివైజ్ ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడం ప్రాధమికంగా మారిందని నివేదిక తెలిపింది. దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహించడంతో డిజిటల్ సర్వీసులకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఇ-గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం డిజిటల్ ఇండియా దృష్టిని ప్రోత్సహించడం వంటి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఇంటర్నెట్ సర్వీసులను వినియోగదారులకు అందించడం సాధ్యపడింది.
Also Read | ఐఫోన్‌లో మీకు తెలియని కొత్త ఫీచర్లు.. అవేంటో తెలుసా?