స్నేహితులకు క్వారంటైన్ హబ్‌గా సల్మాన్‌ఖాన్ ఫాంహౌజ్‌

  • Publish Date - May 10, 2020 / 11:18 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. సెలబ్రెటీలు, ప్రజలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ తో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా పన్వెల్ ఫామ్ హౌజ్ లో ఉంటున్నాడు. అప్పడప్పుడు అక్కడ అందమైన పరిసరాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు సల్లు భాయ్. ఈ క్వారంటైన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారనే విషయం గురించి సల్మాన్ ఖాన్ టైమ్స్ తో  పంచుకుంటున్నారు.

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి సల్లు భాయ్  తల్లి సల్మాన్ ఖాన్, సోదరి అర్పిత, బావమరిది ఆయుష్ శర్మ, వారి పిల్లలతో కలిసి ఫామ్ హౌజ్ లో ఉంటున్నారు. అక్కడ తన మేనల్లుడు అహిల్, మేనకోడలు అయత్ కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారు. వారితో కలిసి ఆటలాడుకుంటూ ఫామ్ హౌజ్ పరిసరాలను మెుత్తం చక్కర్లు కొడుతున్నారు.

అంతేకాకుండా  నేను ఇంకా పని చేస్తున్నాను, నా మనస్సు పని చేస్తోంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత నేను ఏమి చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు. ప్రస్తుతం ఈ ఫామ్ హౌజ్ ఒక బిగ్ బాస్ హౌజ్ లాగా అనిపిస్తుంది. పెయింట్ వేయటంతో కొంతసమయాన్ని గడుపుతున్నాను. అది ఏదో ఒక సమయంలో మీ ముందుకు తీసుకురావచ్చు అని అన్నారు. ఇంకా ఈ ఫామ్ హౌజ్ అతని స్నేహితులకు క్వారంటైన్ కేంద్రంగా మారిందని అన్నారు.

సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్ హౌజ్ 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఫామ్ హౌజ్ లో ఒక ప్రాంతం మెుత్తం తన పెంపుడు జంతువుల కోసం కేటాయించబడింది. ATV కార్లు, ఫామ్ హౌజ్ చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి.  ఈ లాక్ డౌన్ సమయంలో సల్లు భాయ్ షేర్ చేసిన కొన్ని వీడియోస్ లో ఫామ్ హౌజ్ అందాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఫామ్ హౌజ్ కి తన సోదరి అర్పిత పేరు పెట్టారు. అంతేకాకుండా అర్పితా ఫార్మ్స్ గా పిలుస్తారు. ఫామ్ హౌజ్ ప్రవేశ ద్వారం వద్ద గణపతి విగ్రహం ఉంది.

ఈ ఫామ్ హౌజ్ నుంచే బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కి సంబంధించిన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కరోనా తో ఇబ్బందులు పడుతున్న పేదకార్మికులకి తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 25వేల మంది కార్మికులకు రోజువారీ నిత్యావసరాలను అందించటంతో పాటు వారికి ఆర్ధిక సహాయాన్ని చేస్తున్నారు. తన పన్వెల్ ఫామ్ హౌజ్ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న పేదలకి కూరగాయలను, రేషన్ ను పంపిణీ చేశారు. 

పన్వెల్ ఫామ్ హౌజ్ నుంచి ట్రాక్టర్స్, ఎండ్ల బండ్లలో సరుకులని తీసుకెళ్లి మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పంచారు సల్మాన్ ఖాన్. అంతేకాకుండా ఏదైనా అత్యవసర పరిస్ధితి వస్తే గ్రామస్తులు నన్ను లేదా నా బృందాన్ని సాయం కోరవచ్చని స్పష్టం చేశారు. వారికి ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ‘Being Haangryy’ అనే పేరుతో భోజన ట్రక్కులను ప్రారంభించారు.

భోజన ట్రక్కు సంబంధించిన వీడియోని శివసేన చీఫ్ రాహుల్ కనాల్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ సల్మాన్ ఖాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాయం చేయటంలో తనకి తోడుగా నిలిచిన స్నేహితులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, లులియా వాంటర్, గాయకుడు కమల్ ఖాన్, నికేతన్ మాధోక్, వాలూస్చా డిసౌసా తదితరులు కూడా నిత్యావసర వస్తువులను వాహనాలలో లోడ్ చేస్తున్నప్పుడు సాయపడ్డారు. తనకి సహకారం అందించిన వారందరికీ సల్మాన్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.