కరోనా ఫీజు: రాబడిలేని రాష్ట్రాలు బంగారుబాతును తినేస్తున్నాయా?

  • Publish Date - May 6, 2020 / 10:40 AM IST

ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ బెంగాల్, తెలంగాణ మద్యం మీద టాక్స్ పెంచిన తర్వాత మిగిలిన రాష్ట్రాలూ రాబడికోసం కేసీఆర్, జగన్, కేజ్రీవాల్ మార్గంలోనే వెళ్తాయన్న భయం లిక్కర్ కంపెనీలది. ధరలు పెరిగితే అమ్మకాలు తగ్గుతాయి. రాబడి మాత్రం రాష్ట్రాల ఖజనాలోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న జనం ఆచితూచి ఖర్చుచేస్తారు. 40రోజుల నుంచి చుక్కపడట్టేదు కాబట్టి జనాలు క్యూకట్టారు. వారం తర్వాత ఇలాగే జాతర ఉంటాదనుకోలేం.

సోమవారం ఏపీ, ఢిల్లీలు లిక్కర్ షాప్స్ ఓపెన్ చేయగానే జాతర మొదలైంది. జనం తోసుకున్నారు. బారులు….బారులుగా కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడ్డారు. అలాగని రేట్లు తక్కువేం కాదు. ‘Special Corona Fee’ పేరుతో 70 శాతం మేర రేట్లు పెంచింది ఢిల్లీ. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ సైజుకు మించి రేట్లు పెంచేశారు. అయినా క్యూలు తగ్గలేదు. 

లిక్కర్ షాపులు ముందు ఈ జాతరను చూసి అధికారులే చేతులెత్తేశారు. ఏపీలో 75శాతం మేర పన్నులు పెరిగితే, పశ్చిమబెంగాల్ 30శాతం మేర పెంచేసింది. హర్యానా, రాజస్థాన్‌లు కూడా రేట్లు పెంచుతాయని హింట్ ఇచ్చాయి. ఇలా రేట్లు పెంచుతారనేసరికి మూడు లిక్కర్ ఉత్పత్తిసంస్థలు United Spirits, United Breweries, Radico Khaitan షేర్ల ధరలు ఆరు శాతం తగ్గిపోయాయి. రేట్లు పెరిగే సరుకు అమ్మకం తగ్గుతుంది. లాక్‌డౌన్ నష్టాలను పూడ్చుకోవడానికి మందుబాబుల మీద టాక్స్ వేస్తారన్న భయం United Breweriesది. 
 
దేశంలో లిక్కర్ సేల్స్ పెద్ద ఆదాయ వనరు. కొన్ని రాష్ట్రాలు లిక్కర్ షాపులను కంట్రోల్ చేస్తాయి, లేదంటే హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్….కొన్నిసార్లు రెండింటిని నియంత్రిస్తూ ఖజానాను నింపుకొంటున్నారు. 20 ఆర్ధిక సంవత్సరంలో రూ.1.75లక్షల కోట్ల మేర  రాష్ట్రాల నుంచి ఎక్సైజ్ రాబడి వచ్చింది. ఇందులో 12శాతం వాటా లిక్కర్‌ది. టాక్స్‌లు పెరుగుతాయని తెలుసుకాని, ఢిల్లీ, ఆంద్రాల్లా 75శాతం వరకు టాక్స్ పెంచుతారని లిక్కర్ కంపెనీలు అంచనా వేయలేదు. ఇప్పుడు సేల్స్ తగ్గుతాయని లబోదిబోమంటున్నాయి.

ప్రీమియం బ్రాండ్‌ల అమ్మకాలు నాలుగేళ్లుగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రేంజ్ టాక్స్‌లంటే వాటి అమ్మకాలు తగ్గడం ఖాయం. ఆదాయం వస్తోందని బంగారు బాతును రాష్ట్రాలు చంపేస్తున్నాయని లిక్కరీ తయారీ కంపెనీలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ ఓ దారేసింది. ఇప్పుడు ఈ దారిలోనూ కరోనా టాక్స్ పేరుతో కనీసం 30శాతం మేర అన్నిచోట్లా పన్నులు పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి.

Also Read | తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు, ఏ బ్రాండ్ మీద ఎంత పెరిగిందంటే