ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలు!

  • Publish Date - May 7, 2020 / 03:06 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అన్ని పరిశమ్రలు మూతపడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు కూడా మూసివేశారు. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కొన్నిచోట్ల స్కూళ్లు, కాలేజీల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిజోరంలో ప్రైవేట్ స్కూళ్లు కేవలం 50 శాతం మాత్రమే ఫీజులను వసూలు చేయనున్నాయి. 

విద్యార్థుల నుంచి 50శాతం ఫీజు చెల్లించాలని ఆదేశించినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. మిజోరంలో Independent School Association (MISA), ఇతర వాటాదారులతో పాటు విద్యాశాఖ, విద్యార్థుల విభాగ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి Lalchhandama Ralte అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తగ్గింపుపై ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు స్కూల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉందని, దీనిపై ఇప్పటికే విద్యార్థి విభాగాలు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారి తెలిపారు. 

అన్ని ప్రైవేటు, మిషన్ స్కూళ్లను నడిపిస్తున్న చర్చీలో కూడా పేద విద్యార్థులకు ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. ఏప్రిల్ నెలలో మొత్తం ఫీజును వసూలు చేసిన స్కూళ్లన్నీ మే నెలలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని స్కూల్ యాజమాన్యాలను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలో MISA విభాగానికి చెందిన అన్ని ప్రైవేటు స్కూళ్లు నడుస్తున్నాయి. లాక్ డౌన్ ప్రారంభంలో తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు విద్యార్థుల నుంచి మొత్తం ఫీజులను వసూలు చేయాల్సిందిగా సూచించాయి. స్కూల్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 1 ఆరంభం నుంచి కొత్త విద్యా సంవత్సరం (2020-21) ప్రారంభం కావాల్సింది. 

Also Read | జులైలో జేఈఈ మెయిన్, ఆగస్టులో అడ్వాన్స్‌డ్‌, సెప్టెంబర్‌ 1 నుంచి ఇంజినీరింగ్‌ క్లాసులు