ప్లీజ్..నీళ్లు పడకుంటే బోరు బావిని మూసేయండి – పద్మా దేవేందర్ రెడ్డి

  • Publish Date - May 28, 2020 / 12:51 AM IST

ప్లీజ్..నీళ్లు పడకుంటే బోరు బావిని మూసేయండి అని కోరారు TRS MLA పద్మా దేవేందర్ రెడ్డి. చిన్నారుల జీవితాలను రిస్క్ లో పెట్టవద్దన్నారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్‌ జిల్లా పొడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది.

మూడేళ్ల బాలుడు సంజయ్‌ సాయివర్ధన్‌ బోరు బావిలోనే ప్రాణాలు వదిలాడు. బాలుడిని ప్రాణాలతో బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2020, మే 28వ తేదీ ఉదయం మీడియాతో మాట్లాడారు. 

బోరు వేసే వారు బాధ్యతగా వ్యవహరించాలని, నీళ్లు పడకపోతే..వెంటనే పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బోరు వేసే వారు కూడా ఇందులో భాద్యతగా వ్యవహరిస్తే..ఇలాంటి విషాద ఘటనలు జరగవన్నారు. జరిగిన తర్వాత..బాధ పడడం కంటే..ముందే జాగ్రత్తగా వ్యవహరిస్తే…బాగుంటుందన్నారు. పల్లె ప్రగతిలో వెస్ట్ గా ఉన్న బోర్లను మూయించడం జరిగిందని, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరించారనే విషయాన్ని గుర్తు చేశారు.

నీళ్లు పడకుంటే..వెంటనే బోరు బావిని పూడ్చేస్తే..బాగుండేదని, కానీ ఇంత తొందరలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇలాంటి బోర్లను పూడ్చివేస్తామన్నారు. 

అనుమతి తీసుకోవాలి – కలెక్టర్ ధర్మారెడ్డి :-
బోర్లు వేసే ముందు అనుమతులు తీసుకోవాలని చెబుతున్నామని కానీ అనుమతి తీసుకోకుండానే..బోర్లు వేస్తున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వెల్లడించారు. నీళ్లు పడకుంటే..వెంటనే మూసేయకపోవడంతోనే  ప్రమాదం జరిగిందన్నారు. అనుమతి లేకుండానే..పక్కపక్కనే మూడు బోర్లు వేశారని, రిగ్గు ఓనర్ పై చర్యలు తీసుకుంటామని, బోరు వేసే ముందు..అనుమతి ఉందా ? లేదా ? అని రిగ్గు ఓనర్ చూసుకోవాలన్నారు. ప్రతొక్కరికి అవగాహన ఉన్నా…నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 
 

Read: మెదక్ లో విషాదం : బోరు బావిలో పడిన బాలుడు మృతి