NEET 2022: సీబీఐ చేతికి చిక్కిన నీట్ 2022 ఎగ్జామ్ రాకెట్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో మోసానికి పాల్పడిన ఎనిమిది మంది గుట్టు రట్టు చేసింది సీబీఐ. 2022 జులై 17 ఆదివారం జరిగిన నీట్ యూజీ పరీక్షపై జరిపిన సీక్రెట్ విచారణలో ఈ నీట్ 2022 ఎగ్జామ్ రాకెట్ బట్టబయలైంది. నిందితుడు చాలా కాలంగా ఢిల్లీలోనే ఉంటున్నట్లు తెలిసింది.

Neet

 

 

NEET 2022: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో మోసానికి పాల్పడిన ఎనిమిది మంది గుట్టు రట్టు చేసింది సీబీఐ. 2022 జులై 17 ఆదివారం జరిగిన నీట్ యూజీ పరీక్షపై జరిపిన సీక్రెట్ విచారణలో ఈ నీట్ 2022 ఎగ్జామ్ రాకెట్ బట్టబయలైంది. నిందితుడు చాలా కాలంగా ఢిల్లీలోనే ఉంటున్నట్లు తెలిసింది.

సౌత్ ఢిల్లీలోని గౌతమ్ నగర్ నుంచి ఈ రాకెట్ ను హ్యాండిల్ చేసినట్లు తెలిసింది. అతనితో పాటుగా మోసానికి పాల్పడిని ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా ఢిల్లీ, హర్యానాల్లో ఈ రాకెట్‌కు సంబంధించిన మాల్‌ప్రాక్టీసెస్ ను అడ్డుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. జులై 17న జరిగిన నీట్ పరీక్షకు దాదాపు 18లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ వాయిదా వేయాలంటూ జరిగిన నిరసనలను పక్కకు పెట్టి అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల 20నిమిషాల వరకూ పరీక్ష జరిపించారు.

Read Also: నీట్ విద్యార్థుల బుర్ఖా తీయించిన కళాశాల యాజమాన్యం