PM Modi South India Tour : ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. రెండు రోజులు నవంబర్ 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. రూ.25వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని ప్రారంభించనున్నారు.
చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. బెంగుళూరులో నాడప్రభు కెంపేగౌడ 108 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నంలో ONGC U ఫీల్డ్ ఆన్‌షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. గెయిల్ శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
విశాఖపట్నంలో 6-లేన్ గ్రీన్ ఫీల్డ్ రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏపీ విభాగానికి, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు. తమిళనాడులో దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ కాన్వొకేషన్ వేడుకలో ప్రసంగించనున్నారు.
* నవంబర్ 11వ తేదీ ఉదయం 9:45 గంటలకు బెంగళూరులోని విధాన సౌధలో సన్యాసి కవి శ్రీ కనక దాసు, మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
* ఉదయం 10:20 గంటలకు, బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రారంభించనున్నారు. * ఉదయం 11:30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు.
* మధ్యాహ్నం 12 గంటలకు 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ.
* మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో బహిరంగ సభ
* మధ్యాహ్నం 3:30 గంటలకు, తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకలకు హాజరుకానున్న ప్రధాని మోదీ.
* నవంబర్ 12వ ఉదయం 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొననున్న మోదీ.
* 12వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు, తెలంగాణలోని రామగుండంలో ఉన్న RFCL ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.
* తెలంగాణలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం.
* భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం.
* రూ. 2200 కోట్లతో నిర్మించే… మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా రోడ్ల ప్రాజక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.