Telugu » Latest » Rahul Gandhi Bharat Jodo Yatra In Sangareddy District Photo Gallery
Bharat Jodo Yatra: సంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (ఫొటో గ్యాలరీ)
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర గురువారం పటాన్ చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్ ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు వారి సంప్రదాయ వేషధారణలో రాహుల్ కు అడుగడుగునా స్వాగతం పలికారు. రాహుల్ చిన్నారులతో క్రికెట్ ఆడుతూ, పాఠశాల విద్యార్థులతో చేతులు కలుపుతూ సరదాగా పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా దారిపొడవునా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పలువురి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్ కొట్టుకోవటం అందరినీ ఆకట్టుకుంది.