ఐఫోన్ అంటే ఇష్టపడని వారే ఉండరు. ఐఫోన్ ఒక ప్రత్యేకమైన సార్ట్మ్ ఫోన్. ఐఫోన్ కొనేందుకు ఎంత ఖర్చు చేస్తారో తెలియదు కానీ.. ఐఫోన్ లో ఉండే ఫీచర్లు ఎలా ఉపయోగించాలో తప్పక తెలుసుకోవాల్సిందే. ఒక వేళ మీరు కొత్తగా ఐఫోన్ వాడుతున్నారా? మీరు ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 11 వాడుతున్నారా? అయితే వాటిలో ఉన్న hidden features గురించి తెలుసా? ఇప్పుడు ఆ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం…
iPhone’s LED flash for alerts:
మీరు ఏదో పనిలోనో, మీటింగ్ లోనో బిజీగా ఉండి మీ ఫోన్‌కి వచ్చిన కాల్ vibration కూడా వినలేక పోతున్నారా? అయితే ఐఫోన్‌లో ఉండే LED ఫ్లాష్ ఫీచర్‌ని ఉపయోగించి మీ మెుబైల్ కి వచ్చిన ఫోన్ కాల్స్ గాని, మెసెజ్ గాని ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఐఫోన్ iOS (iphone operaing system) లో inbulit అయి ఉంటుంది.
> ఐఫోన్‌లో settings ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి.
> General అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
> ఆ తర్వాత Accessibility ఆప్షన్ కు వెళ్లాలి.
> అందులో hearing ఆప్షన్‌లోకి వెళ్లి audio/visual, led flash alertsను ఆన్ చేయండి.
How to send someone a kiss:
ఐఫోన్‌లోని message యాప్‌కు డిజిటల్ టచ్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది డ్రాయింగ్, హార్ట్స్, kiss సింబల్స్ ఈజీగా పంపవచ్చు. అది ఎలాగో చూద్దాం..
> మీ ఐఫోన్ లోని message యాప్ ఓపెన్ చేసి, new chat అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
>డిజిటల్ టచ్ ఐకాన్‌పై రెండు వేళ్ళతో టచ్ చేయగానే Kiss సింబల్ వస్తుంది. మళ్ళీ ఐకాన్‌పై టచ్ చేయగానే హార్ట్ సింబల్ వస్తుంది. ఈ సింబల్స్‌ని మీకు ఎంతో ఇష్టమైన వారికి పంపండి.
Turn your iPhone into virtual measuring tape:
మీరు ఒక బీరువాను కొనాలి అనుకుంటున్నారా? అయితే అది మీ గదిలో సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఐఫోన్ లోని Measure app ఉపయోగించి తెలుసుకోండి. ఈ యాప్ ను ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
> మీ ఐఫోన్‌లోని Measure appని ఓపెన్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్ పై సర్కిల్ కనిపిస్తుంది. ఆ సర్కిల్‌లో మీరు కొలవాలనుకున్న వస్తువుపై ఉంచండి.
> ‘+’ సింబల్‌ని క్లిక్ చేయటం ద్వారా మీరు వస్తువు కొలవచ్చు. white dotని ఉపయోగించి మీరు వస్తువు చివరి వరకు జరపవచ్చు.
> అదేవిధంగా ‘+’ పై మళ్ళీ క్లిక్ చేసి వస్తువు ఎండ్ పాయింట్‌ని ఎంచుకోవచ్చు.
>ఈ యాప్ ని ప్రస్తుతం length,width కోలవటంతో పాటు surface areaను కోలవటానికి ఉపయోగిస్తున్నారు.
> ఇప్పుడు మీరు కొలవటం అయిపోగానే capture buttonపై క్లిక్ చేసి image save చేసుకోండి.
Use your keyboard as a trackpad:
మీ ఐఫోన్‌లో ఉండే మరో అద్భుతమైన ఫీచర్ గురించి తెలుసుకుందాం. మీ ఐఫోన్ లో keyboard నిvirtual trackpad గా మార్చుకోవటం ఎలానో మీకు తెలుసా?
మీ keyboard లోని Spacebar పై రెండు సెకన్ల పాటు నొక్కి ఉంచటం వల్ల మీరు curserని ఎటువైపు కావాలంటే అటువైపు జరుపుకోవచ్చు. ఇది ఐఫోన్ లో ఉంటే ముఖ్యమైన ఫీచర్.
Pair PS4 or Xbox One controller to your iPhone:
మీరు Call of Duty లేదా Oceanhorn 2, Knights of the Lost Realm ఆడుతున్నారా?
> ఐఫోన్ PS4 DualShock 4 controller లేదా Xbox One controllerని support చేస్తుంది. అది ఎలాగో చూద్దాం.
> మీకు Xbox One controller ఉంటే, Xbox బటన్‌ని క్లిక్ చేయండి. తర్వాత small connect button నొక్కి ఉంచి, దానిని pairing modeకి మార్చండి.
> లేదంటే, మీ దగ్గర PS4 controller ఉందా? అయితే PS4 బటన్, share బటన్ రెండింటని కనెక్ట్ చేసి ఉంచాలి.
> ఇలా ఈ రెండు బటన్స్ white light వచ్చే వరకు ఆన్ చేసి ఉంచాలి.
> మీ ఐఫోన్ settings ఓపెన్ చేసి అందులో Bluetooth ఆప్షన్‌ను ఆన్ చేయాలి.
> xbox controller/dual shock 4 controller ఆప్షన్ ఎంచుకోవాలి. వాటిని ఐఫోన్‌తో pair కోసం క్లిక్ చేయండి.