సీనియర్ నటి జయచిత్ర భర్త గణేష్ మృతి

  • Publish Date - December 5, 2020 / 12:37 PM IST

Jayachitra’s Husband Ganesh: సీనియర్‌ నటి జయచిత్ర భర్త గణేష్‌ శుక్రవారం ఉదయం చెన్నైలోని తిరుచ్చిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన గణేష్‌ 1983లో జయచిత్రను గణేష్‌ వివాహం చేసుకున్నారు. వీరికి అమ్రీష్‌ అనే కొడుకు ఉన్నాడు.

అమ్రీష్ తమిళ సినీ పరిశ్రమలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గణేష్ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు మరియు నగర ప్రజల సందర్శనార్థం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసంలో ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.