మ్యాస్ట్రో ఇళయరాజా స్టూడియోలో సూపర్‌స్టార్ రజినీకాంత్

Rajinikanth – Ilaiyaraaja: ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే సినీ ప్రేమికులకు, అభిమానులకు ఎలా అనిపిస్తుంది.. బొమ్మ అదుర్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడలాంటి ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా, సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కలిసి ఉన్న పిక్ అది.

ఇళయారాజా చెన్నైలో రీసెంట్‌గా కొత్త మ్యూజిక్ స్టూడియో నిర్మించుకున్నారు. ఇటీవలే ప్రారంభమైన రాజా స్టూడియోను రజినీ విజిట్ చేశారు. కాసేపు స్టూడియో అంతా కలియ తిరిగి, రాజాతో ముచ్చటించారు.

ఇరువురూ సంగీతంతో పాటు సినిమాల గురించి చర్చించుకున్నారు. గతంలో రజినీ నటించిన పలు సూపర్ హిట్ సినిమాలకు రాజా మెమరబుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. రజినీ ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు