Mobile Phone Ban : 18 ఏళ్లలోపువారు మొబైల్ ఫోన్ వాడకూడదు .. నిబంధన అతిక్రమిస్తే జరిమానా : గ్రామ సర్పంచ్ ఆదేశం

18 ఏళ్లలోపువారు మొబైల్ ఫోన్ వాడకూడదని ఈ నిబంధన అతిక్రమిస్తే జరిమానా తప్పదంటూ గ్రామ సర్పంచ్ ఆదేశించారు.

Mobile Phone Ban IN Maharashtra Maharashtra : 18 ఏళ్లలోపువారు మొబైల్ ఫోన్ వాడకూడదని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఈ వింత నిర్ణయం తీసుకున్న మొదటి గ్రామ పంచాయతీగా నిలిచింది మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా బన్సి గ్రామం. కానీ యువత నుంచి వ్యతిరేకత రాదా?అంటే వస్తుంది. ఎందుకంటే అంతగా మొబైల్ ఫోన్లకు ఎడిట్ అయిపోయిన పరిస్థితి.

కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల కోసం పిల్లలు మొబైల్‌ఫోన్లు వాడడం ప్రారంభించారని..తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అయినా పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారని..వాటికి బానిసలుగా మారిపోయారని అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్‌ గజానన్‌ తెలిపారు.

చదువు కోసం మొదలైన ఫోన్లు పిల్లలకు అవే ఫోన్లు ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఇతర సైట్లు చూస్తూ సమయం వృథా చేస్తున్నారని చదువును కూడా పట్టించుకోవట్లేదని అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం తప్ప వారి స్వేచ్ఛను హరించటానికి కాదని స్పష్టంచేశారు. ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకున్న మొదటి పంచాయతీగా మా గ్రామం నిలిచింది అని తెలిపారు.

ఈ నిర్ణయాన్ని అమలు చేయటానికి ఇబ్బందులు వస్తాయి. వ్యతిరేకతా వస్తుంది. కానీ తప్పదు. దీన్ని అమలు చేయటానికి పిల్లలకు..వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు.

కౌన్సెలింగ్ తర్వాత కూడా పిల్లలు మొబైల్ ఫోన్లు వాడితే జరిమానా విధించటానికి కూడా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు సర్పంచ్‌ గజానన్‌. ఈ నిర్ణయం పిల్లలను తిరిగి చదువుల వైపు మళ్లించడమే లక్ష్యమని..మొబైల్ ఫోన్‌ల వల్ల దృష్టి మరల్చకుండా చేయడమే దీని ఉద్దేశమని సర్పంచ్ స్పష్టంచేశారు.

 

ట్రెండింగ్ వార్తలు