టోలి చౌక్‌లో వేలాది మంది బీహార్ వలస కూలీలు ఆందోళన

  • Publish Date - May 3, 2020 / 12:24 PM IST

టోలి చౌక్ లో వేలాది మంది బీహార్ వలస కూలీలు ఆందోళనకు దిగారు. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు పోలీసులు నచ్చజెప్పుతున్నారు. అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో వలస కూలీలు అక్కడి చేరుకుని భైఠాయించారు. 

హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలోని టోలిచౌకి వాస్తవానికి పరిశీలిస్తే రెడ్ జోన్ ఏరియా. కానీ కొద్దిసేపటికి క్రితం అనేకమంది రోడ్లపైకి ఆందోళనకు దిగారు. తమ సొంతూళ్లు పంపించాలని, తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయాలో ఉంటున్న బిహార్ కూలీలు టోలిచౌకిలోని రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రహదారిపై భైఠాయించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. 

వలస కార్మికులకు పోలీసులు నచ్చ చెప్పుతున్నారు. వారి స్వస్థలాలకు, గమ్యస్థానాలకు చేర్చాలంటే సమయం పడుతుంది. ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి చర్చించిన తర్వాత మరిన్ని విషయాలను వలస కార్మికులకు వివరిస్తామని చెప్పి నచ్చ చెప్పుతున్నప్పటికీ వలస కార్మికులు ససేమిరా అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం  అందిస్తున్న ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకులు, రూ.1500, కేంద్రం అందిస్తున్న  రూ.500…ఇవ్వని ఉన్నప్పటికీ తమ స్వంత ఊరిలో ఉన్న ఫీలింగ్ ఇక్కడ ఉంటే రాదు కాబట్టి సొంతూళ్లు వెళ్లేందుకు తమకు పర్మీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.