ట్రంప్ ‘వుహాన్ ల్యాబ్’ కుట్ర సిద్ధాంతమంతా భోగస్!

  • Publish Date - May 7, 2020 / 07:16 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి డ్రాగన్ గట్టిగా వాదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వెస్టరన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ట్రంప్ అగ్ర ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ.. ట్రంప్ కుట్రా సిద్ధాంతమంతా భోగస్ అంటూ నీళ్లు చల్లారు. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపారేస్తున్నారు.

వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ ఉద్భవించిందనే ట్రంప్ సిద్ధాంతానికి మద్దతు లభించడం లేదు. గతవారమే వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో ట్రంప్ దీనిపై గట్టిగా నొక్కి చెప్పారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో COVID-19 ఉద్భవించిందని నిరూపించడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ, వీరి వాదనకు కొద్దిమొత్తంలోనే మద్దతు లభిస్తోంది. 

ఆరోగ్య, ఇంటెలిజెన్స్ అధికారులు సైతం దీనికి సంబంధించి ఆధారాలను ఎక్కడ చూపించలేదనడంతో పెద్దగా మద్దతు లభించలేదు. ‘కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వ్యాప్తి చెందింది అనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయో చెప్పాల్సిన అవసరం ఉందని U.S. National Institute of Allergy, Infectious Diseases డైరెక్టర్ డాక్టర్ Fauci అన్నారు. ఈ కొత్త కరోనా వైరస్ విషయంలో మనం చాలా నేర్చుకోవాల్సి ఉందని ఏదో కృత్రిమంగా లేదా కావాలనే మార్చేయడం సరికాదని తెలిపారు. ప్రకృతిలో పరిణామ క్రమంలో వైరస్ ఉద్భవించి ఇతర జాతుల్లోకి ప్రవేశించి ఉండొచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. గతవారంలో ట్రంప్ చైనానే వైరస్ వ్యాప్తికి కారణమంటూ విమర్శలు గుప్పించారు. 

అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా చైనాకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ట్రంప్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. కేవలం ఊహాగానాలు మాత్రమేనని WHO కొట్టిపారేసింది. ఇప్పటివరకూ కరోనా వైరస్ వ్యాప్తి మూలానికి సంబంధించి ఎలాంటి డేటా లేదా ప్రత్యేకమైన ఆధారాలను యూనైటెడ్ స్టేట్స్ తమకు పంపించలేదని WHO ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ చెప్పారు. మరోవైపు బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం చైనీస్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని The Guardianతో చెప్పారు. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కెనడాతో కూడిన Five Eyes ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ నుంచి లీక్ అయినట్లు ‘15-పేజీల పత్రం’పై కూడా ఆధారాలు అనుమానం వ్యక్తం చేశాయి. 

ఆస్ట్రేలియా డైలీ టెలిగ్రాఫ్‌లోని ఒక నివేదిక ఆధారంగా వుహాన్ ల్యాబ్‌లో ఒక పరిశోధకుడి ప్రకారం.. అక్కడ ఎవరికి వైరస్ సోకలేదని (జోరో పేషెంట్)గా పేర్కొన్నాడు. Five Eyes బృందంలోని మరో నలుగురిలో ముగ్గురు సభ్యులు ట్రంప్ వైరస్ మూలంపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా వైరస్ వుహాన్ లోని వైల్డ్ లైఫ్ వెట్ మార్కెట్ నుంచి ఉద్భవించే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. దీనిపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తికి బీజింగ్ కారణమంటూ ట్రంప్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 

కరోనా వైరస్ అంటే.. చైనీస్ వైరస్ లేదా వుహాన్ వైరస్ అంటూ చైనాను ట్రంప్ ఒక విలన్‌ అంటూ చిత్రీకరించేందుకు ప్రయత్నించారనేది డ్రాగన్ వాదన. మరోవైపు కరోనా వైరస్ ను విజయవంతంగా నియంత్రించిన చైనా.. ప్రపంచ దేశాలకు సాయం చేస్తోంది. కరోనా సంక్షోభంలో ఉన్న దేశాలకు అవసరమైన వనరులను అందిస్తోంది. అదేసమయంలో డ్రాగన్ దేశం కూడా అమెరికా ఆరోపణలను తిప్పికొట్టింది. గత ఏడాది అక్టోబర్ నెలలో వుహాన్‌లో వరల్డ్ మిలటరీ గేమ్స్ జరుగుతున్న సమయంలో ఒక యూఎస్ మిలిటరీ అథ్లెట్ ఈ వైరస్ అంటించాడంటూ ప్రాంతీయ మీడియా ద్వారా తన వాదనను వినిపించింది. 

Also Read | తొందరపడి లాక్ డౌన్ ఎత్తేయవద్దు…ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక