లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం షాపులను మూసివేశారు. మద్యం అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మద్యం కోసం షాపుల మందు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మద్యం ప్రియుల భారులు తీరి నిల్చున్నారు. అయితే పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం క్యూలైన్ లో నిల్చున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్, మాదాపూర్, పంజాగుట్టలో మద్యం షాపుల ముందు మహిళలు క్యూ కట్టారు. మరికొన్ని చోట్ల వృద్ధ మహిళలు సైతం మద్యం కోసం లిక్కర్ షాప్ ల దగ్గరకు వెళ్లడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం(మే 6, 2020) ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరిచి, విక్రయాలు ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. రాష్ట్రంలో 2, 200 మద్యం దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నెల రోజులకు పైగా మద్యం షాపులు మూసివేశారు. మద్యం కొనేందుకు మందుబాబులు రెడీ అయ్యారు. ఉదయాన్నే మద్యం షాపుల దగ్గరికి చేరుకున్నారు. ముందు బాబులు పెత్త ఎత్తున బారులు తీరారు.
కంటైన్ మెంట్ జోన్లలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అన్ని జోన్లలో మద్యం షాపులను ఓపెన్ చేశారు. మద్యం దొరక్క విలవిలలాడిపోయిన మందు బాబులు, ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. మద్యం షాపులు తెరవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.