World First Vegetarian City : ప్రపంచంలోనే మొదటి పూర్తి శాఖాహార నగరం .. మన భారత్ లోనే ఎక్కడుందో తెలుసా..?!

ప్రపంచంలోనే మొదటి పూర్తి శాఖాహార నగరం .. మన భారత్ లోనే ఉంది. ఈ నగరం పేరు..

world’s first completely vegetarian city : వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అంటే శాఖాహారం తినే మనుషులు..మాంసాహారం కూడా తినే మనుషులు. జంతువుల్లో కూడా శాఖాహారం మాంసాహారం జంతువులు ఉంటాయి. ఇదిలా ఉంటే ఏ గ్రామంలో అయినా…ఏ నగరంలో అయినా శాఖాహారం..మాంసాహారం తినే మనుషులు ఉంటారు. కానీ ఓ నగరం మాత్రం అచ్చమైన స్వచ్ఛమైన పూర్తి ‘శాఖాహార’నగరంగా పేరొందింది. ఇది ఎక్కడో కాదు మన భారత దేశంలోనే ఉంది.ఈ నగరం గురించి చాలామందికి తెలియదు. ప్రపంచంలోని మొట్ట మొదటి పూర్తి శాఖాహార నగరంగా పేరొందింది. అదే ‘పాలిటినా నగరం’..

ఇది భారత్ లోని గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లాలో ఉంది. ఇది పెద్ద నగరం కాదు ఓ చిన్నపాటి నగరం. జైన మతాన్ని అనుసరించే వారికి ఇది ఎంతో స్వచ్ఛమైన నగరంగా..జైనుల పుణ్యక్షేతంగా పేరొందింది. ఇక్కడ జంతువులను చంపడం పూర్తిగా చట్ట విరుద్ధం. ముఖ్యంగా తినటానికి చంపకూడదు.గుడ్లు,మాంసాన్ని అమ్మడం కూడా పాలిటినా నగరంలో జరగదు. దానికి ఎటువంటి అనుమతి లేదు. ఇక్కడ జంతువులను చంపడం చట్టప్రకారం శిక్షార్హం.

2014 సంవత్సరంలో ఈ ప్రాంతంలో జంతువుల వధింయటంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. అప్పటి నుండి ఇక్కడ ఒక్క జంతువు కూడా చంపబడలేదు. ఈ నగరంలో వందలమంది మంది జైన సన్యాసులు జంతువుల వధను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో జంతువుల వధించటం జరిగితే తాము ప్రాణత్యాగం చేస్తామని జైన సన్యాసులు తమ నిరాహార దీక్ష ద్వారా తెలియజేయడంతో ప్రభుత్వం జంతు వధను నిషేధించింది. ఓ జంతువు ప్రాణం పోవటం కంటే తాము చనిపోవటమే సరైనదిగా మేం భావిస్తున్నామని జైన సన్యాసులు తేల్చి చెప్పటంతో ప్రభుత్వం దిగి వచ్చి అప్పటినుంచి దీన్ని అమలు చేస్తోంది.

అప్పట్లో జంతు వధను వ్యతిరేకిస్తూ జైన సన్యాసులు వందలాది కసాయి దుకాణాలను మూసి వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వాటిని మూసి వేసేలా చేసింది. దీంతో ఈ నగరాన్ని మాంసం లేని శాఖాహార ప్రాంతంగా ప్రకటించారు. ఇక పాలు..పాల ఉత్పత్తులు దొరుకుతాయి. నగరంలోని ప్రజలు పాలు, నెయ్యి, వెన్న లాంటివి తీసుకుంటారు.

సన్యాసులు పాలిటానాను శాఖాహార గ్రామంగా ప్రకటించమనడానికి కారణం ఇది వందలాది దేవాలయాలను నిలయంగా ఉండటం మరో కారణం. ఈ ప్రాంతం జైనులకు ప్రధాన యాత్రికుల కేంద్రంగా విరాసిల్లుతోంది. వారి రక్షకుడైన ఆదినాథ ఒకప్పుడు ఇక్కడి కొండలపై నడయాడారని జైనులు నమ్ముతారు. అటువంటి పవిత్ర ప్రాంతంలో జంతువు వధలు ఉండకూడదని నిర్ణయించారు. ఆ దిశగా జైన సన్యాసులు ప్రభుత్వాన్ని ఒప్పించారు. అప్పటి నుండి ఈ నగరం ఆయన అనుచరులకు ముఖ్యమైన ప్రదేశంగా మారిందని చెబుతారు. జైన మతం ప్రపంచ వ్యాప్తంగా ఉంది.

భావ్ నగర్ కు నైరుతి దిశలో 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాలిటానా ప్రపంచంలో 1000కి పైగా దేవాలయాలు కలిగిన ఏకైక పర్వతం అనే రికార్డును కలిగి ఉంది. ఈ నగరం జైన సమాజానికి అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రంగా కాదు కాదు పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయ సముదాయంగా కూడా పరిగణింపబడుతోంది. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉండే  ఆలయాల్లో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి.

ఈ ప్రాంతంలో అద్భుతంగా పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు శత్రుంజయ కొండపై ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధాన ఆలయం జైన తీర్థంకరులలో మొదటి వాడైన స్వామి అధినాథ్ (రిషభదేవుడు) కి అంకితం ఈయబడింది. శత్రుంజయ కొండ పైభాగంలో జైన ఆలయాల సమూహం ఉంది. దీనిని 11 వ శతాబ్దం నుండి 1900 సంవత్సరంలో జైన తరాలవారు నిర్మించారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు