Anemia problem during pregnancy! Iron tablets, if not injected_
గర్భం దాల్చేటప్పుడు కనీసం 12.5శాతం హిమెగ్లోబిన్ ఉంటేనే తల్లీ బిడ్డ క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి రక్తహీనత ఉండటం వల్ల కాన్పు సమయంలో కొద్ధిగా రక్తస్రావం అయినా తట్టుకోలేరు. ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఉంటే విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఏ పనినీ చురుకుగా చేసుకోలేరు. ఐరన్ లోపంతో కడుపులో బిడ్డకూ ఎదుగుదల సమస్యలు ఉంటాయి. శరీరంలో తగినంత రక్తం ఉన్నప్పుడే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగి జీవక్రియలు చురుగ్గా, సజావుగా జరుగుతూ ఉంటాయి. శరీరంలో శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది.
గర్భిణీలో కలిగే రక్తహీనత అరికట్టడానికి, గర్భంలో పిండం ఎదగటానికి, గడువుకు మందుగా ప్రసవించడం నివారించడానికి, అతి తక్కువ బరువు ఉన్న శిశువును ప్రసవించకూడదనుకుంటే గర్భిణీలు ఐరన్‌తోపాటు, ఫోలినిక్ యాసిడ్ అవసరం. గర్భిణీ స్త్రీ అన్ని రకాల విటమిన్లు తీసుకోవాలి. అయితే కొందరు గర్భిణీల్లో రక్తహీనత అరికట్టేందుకు ఇచ్చే ఇంజక్షన్లు, మాత్రలు ఏమాత్రం సరిపడవు. చాలామందికి ఐరన్ మాత్రల వల్ల వికారం, వాంతులు ఉంటాయి. ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు మీకు ఐరన్ మోతాదు ఎంత ఉంది, ఏదైనా జెనెటిక్ సమస్యలు, సికెల్ సెల్, తలసీమియా వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గాయా,వంటివన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.ఆస్తమా, ఎలర్జీలు, లివర్ సమస్యలు, ఇన్‌ఫెక్షన్స్ ఉంటే మోతాదు విషయంలో వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
మాత్రలు, ఇంజక్షన్ల కంటే ఐరన్ పెంచుకునే ఆహారాలను తీసుకోవటం మంచిది. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ రోజు తినాలి. అలాగే క్యారెట్, బీట్‌రూట్ , టమాటా జ్యూసెస్‌ను తాగొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలాపళ్లు, నిమ్మ వంటి వాటిని తీసుకోవాలి. గర్భిణీ అన్నీ రకాల ఆకుకూరలు, కూరగాయలు, మాంసం , చేపలు, గుడ్లు తీసుకోవాలి. అన్నం తక్కువ తిన్నా ఫరవాలేదు కానీ తగిన పోషక విలువలు గల పదార్థాలు తీసుకోవాలి. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసం, రెండు మూడు రకాల పండ్లు తప్పనిసరిగా తీసుకోండి.