Unwanted Pregnancy : అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే విషయంలో సొంతపద్దతులు శ్రేయస్కరమేనా?

సొంతంగా అబార్షన్లు అధిక రక్తస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి అసురక్షిత పద్ధతుల వల్ల ఒక్కోసారి రక్తనాళాలు డ్యామేజ్‌ అయి అంతర్గత రక్తస్రావం కావటం మూలంగా ప్రాణాల మీదకు వచ్చే దాకా ఈ సమస్యను గుర్తించలేరు.

Are home remedies better when it comes to getting rid of an unwanted pregnancy?

Unwanted Pregnancy : ఇటీవలి కాలంలో చాలా మంది అవాంఛిత గర్భాన్నితొలగించుకునే క్రమంలో సొంత నిర్ణయాలను, పద్దతులను అనుసరిస్తున్నారు. మార్కెట్లో లభించే మాత్రలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. ఈ సందర్భంలో గర్భం మొత్తం శుభ్రపడకపోగా తీవ్ర ఇన్ఫెక్షన్‌ బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

లైంగిక హింస, సురక్షితమైన గర్భనిరోధక సాధనాలు, పద్ధతులు పాటించకపోవడం ఇలా అనేక కారణాల వల్ల గర్భం దాల్చుతున్నారు. కొన్ని భయాందోళనలతో గుట్టు చప్పుడుకాకుండా ఇంట్లోనే తమకు తామే అబార్షన్‌ చేసుకునే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ఇంట్లోనే అబార్షన్‌ చేసుకునే క్రమంలో మాత్రలు వాడడం, ఇతర పరికరాల్ని ఉపయోగించడం వల్ల గర్భాశయం పూర్తిగా శుభ్రపడక తద్వారా అధిక రక్తస్రావం, జననాంగాల్లో ఇన్ఫెక్షన్‌ వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఇది చివరకు సంతానలేమికి దారితీసే ప్రమాదం ఉంటుంది.

అధి రక్తస్రావం ;

సొంతంగా అబార్షన్లు అధిక రక్తస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి అసురక్షిత పద్ధతుల వల్ల ఒక్కోసారి రక్తనాళాలు డ్యామేజ్‌ అయి అంతర్గత రక్తస్రావం కావటం మూలంగా ప్రాణాల మీదకు వచ్చే దాకా ఈ సమస్యను గుర్తించలేరు.

గర్భస్రావం చేసుకోవడమంటే బలవంతంగా నెలసరిని ప్రారంభించడమే అవుతుంది. ఈ క్రమంలో అయ్యే బ్లీడింగ్‌ని అదుపు చేయడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఇలా ఈ రెండు పద్ధతుల కారణంగా ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోయి రక్తహీనత తలెత్తడంతో పాటు అవయవాలకు రక్తం, ఆక్సిజన్‌ అందక అవి దెబ్బతినడం, ఒక్కోసారి ప్రాణ సంకటంగా పరిణమించచ్చు.

ఈ లక్షణాలు ఉంటే ;

స్వీయ అబార్షన్లలో భాగంగా కొంతమంది హెర్బల్‌ పద్ధతుల్ని అనుసరించటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. గంటగంటకూ శ్యానిటరీ న్యాప్‌కిన్‌ మార్చుకునేంత రక్తస్రావమవుతుంది. మూత్ర-మల విసర్జనలో రక్తం కనిపిస్తుంది.

చర్మం పాలిపోయినట్లుగా, పసుపు రంగులోకి మారుతుంది. పొత్తి కడుపులో తీవ్ర నొప్పికలుగుతుంది. విపరీతమైన నీరసం, అలసట, స్పృహ కోల్పోవడం, జ్వరం, ఎక్కువగా చెమటలు పట్టడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించి వెంటనే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం వల్ల కొంతవరకు ఫలితం ఉండచ్చు.