అసలే కరోనా కాలం.. కొంచెం జలుబు చేసినా.. తుమ్మినా.. దగ్గొచ్చినా వామ్మో కరోనా అంటూ భయపడిపోతున్నారు. మాములు ఫ్లూ అయినా కరోనా అనే భయమే అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో కనిపించే లక్షణాల్లో కంటే కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ఆరంభంలో మాదిరిగా లేదు.. రూపాంతరం చెందింది.. జన్యు పరంగా మార్పులు చేసుకుంటూ మరింత ప్రాణాంతకంగా మారిపోతోంది. మొన్నటివరకూ కనిపించిన లక్షణాలే కాకుండా కొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయంట.. అందులోనూ ఆ లక్షణాలను చూస్తే.. సాధారణ లక్షణాల మాదిరిగానే ఉంటున్నాయంట… చాలామందిలో నోటి పూత.. చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటి చర్మ వ్యాధులను చాలా తేలికగా తీసుకుంటారు.
ఎందుకంటే.. అవి అంతటే అవే కొన్నిరోజులకు తగ్గిపోతాయి. ఇప్పుుడు కరోనా వైరస్ సోకిన వారిలో ఈ తరహా లక్షణాలే కనిపిస్తున్నాయంట.. నోటీపై దద్దుర్లు వస్తున్నాయంట.. ఇది కూడా కరోనా లక్షణాలు కావొచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి లోపలి భాగంలో దద్దుర్లు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. నోటి కుహరంలో కనిపించే గాయాలను వైద్యపరిభాసలో enanthem అని పిలుస్తారు.
కోవిడ్ లక్షణాల్లో ఒకటిగా కనిపించడం ఇప్పుడు వైద్య నిపుణులను సైతం కలవరపెడుతోంది. enanthem శ్లేష్మ పొరపై దద్దుర్లు (చిన్న మచ్చలు) గా ఏర్పడుతాయని అంటున్నారు. చికెన్ పాక్స్, చేతి, పాదం, నోటి పూత వంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంటుందని తెలిపారు.
శ్లేష్మ పొరల్లో కనిపించే వైరల్ దద్దుర్లు కూడా కరోనా లక్షణమేనని అంటున్నారు. కరోనా సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త స్పానిష్ అధ్యయనం జామా డెర్మటాలజీలో ప్రచురించారు. ఏప్రిల్ ప్రారంభంలో కోవిడ్, అనుబంధ చర్మ దద్దుర్లు 21 మంది కరోనా రోగుల్లో ఉన్నాయని గుర్తించారు. ఈ రోగులలో ఆరుగురు (29శాతం) నోటి లోపలి భాగంలో ఎనాంతెమ్ తో బాధపడుతున్నారని కనిపెట్టారు. బాధిత రోగులు 40ఏళ్లు నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారని, ఆ ఆరుగురిలో నలుగురు మహిళలే ఉన్నారని పరిశోధక బృందం పేర్కొంది.
నోటి దద్దుర్లతో మొదలైన ఈ లక్షణాలు రెండు రోజుల ముందు నుంచే 24 రోజుల తరువాత శరీరంలో ఎక్కడైనా కనిపించ వచ్చునని అంటున్నారు. లక్షణాలు ప్రారంభం కావడానికి 12 రోజుల సమయం పడుతుంది. కొత్త కరోనావైరస్ కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయనే అనుమానాన్ని మరింత బలపరుస్తోంది.
ప్రారంభంలో చర్మమంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. కోవిడ్‌తో ఈ లక్షణం ఎంతమందిలో ఉంది కచ్చితమైన డేటా లేదు. భద్రతా సమస్యలతో కోవిడ్ -19 అనుమానం లేదా పాజిటివ్ అని తేలిన రోగులకు వారి నోటిలోపల సమస్యలను పరీక్షించాల్సిన అవసరం ఉందని జిమెనెజ్-కాహే బృందం వెల్లడించింది.