Burning In The Stomach : కడుపులో మంటతో బాధపడుతున్నారా ? కారణాలు అనేకం!

ఆహారం అరగకపోవడం, మలబద్ధకం. చేదు, పులుపుతో కూడిన తేన్పులు వంటి లక్షణాలు చివరకు కడుపులో మంటకు దారి తీస్తాయి. కాలేయం, మూత్రపిండాల సమస్యలు, గాల్‌బ్లాడర్‌ సమస్య ఉన్నవారికి పైత్యంతో కూడిన కడుపు మంట బాధించే ఆస్కారం ఉంటుంది.

Burning In The Stomach :

Burning In The Stomach : ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పని ఒత్తిడి, మానసిక సమస్యలు, నెలసరి ముందు వచ్చే ఆందోళనలు, రోజువారిగా తీసుకునే టీలు, కాఫీలు, ధూమపానం, పులుపు, ఉప్పు, కారం, మసాలాలు కడుపులో మంట సమస్యను తెచ్చిపెడతాయి.

మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. తలనొప్పి, కీళ్ల నొప్పికి కొలెస్ట్రాల్‌కి అధికంగా మందులు వాడే వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

కడుపులో మంటకు కారంగా ఉండే ఆహారం, నూనెల్లో వేయించిన పిండి వంటలు, వేపుళ్లు, కడుపులో ఆమ్లాలను పెంచి మంట పుట్టిస్తాయి. కొన్నిసార్లు వయసుతోపాటు ఎంజైములు తగ్గి ఆమ్లాలు పెరిగి కడుపులో మంట కలుగుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ, టీలు, నిమ్మరసం తాగినా, వేడి పదార్థాలు తిన్నా కొంత మందికి క‌డుపులో మంట సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు.

ఆహారం అరగకపోవడం, మలబద్ధకం. చేదు, పులుపుతో కూడిన తేన్పులు వంటి లక్షణాలు చివరకు కడుపులో మంటకు దారి తీస్తాయి. కాలేయం, మూత్రపిండాల సమస్యలు, గాల్‌బ్లాడర్‌ సమస్య ఉన్నవారికి పైత్యంతో కూడిన కడుపు మంట బాధించే ఆస్కారం ఉంటుంది.

కడుపులో మంటగా ఉన్న సమయంలో గోరువెచ్చటి నీళ్లు మాత్రమే తాగాలి. పప్పు దినుసులు మితంగా తీసుకోవాలి. ఉడికిన కూరలను తీసుకోవాలి. ఆహారం ఒకే సారి ఎక్కువ మొత్తంగా కాకుండా కొంచెం కొంచెంగా తినాలి. పుల్లటి పళ్లు, పులుసులను తీసుకోకూడదు. మజ్జిగలో గోరువెచ్చటి నీళ్లు కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది.

కడుపులో మంటను తగ్గించే సహజసిద్ధపదార్దాలు ;

1. విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరి పొడిని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. క్యారెట్‌, బీట్‌రూట్‌ రసాలు కడుపులో ఆమ్లాలను తగ్గిస్తాయి.

2. అతి మధురం చిటికెడు, కరక్కాయ పొడి రెండు చిటికెలు తీసుకుని వీటికి సమానంగా పంచదార, చిటికెడు నెయ్యి వేసి భోజనానికి ముందు తీసుకోవాలి. కరక్కాయ, అతిమధురం, నేల ఉసిరి, చిటికెడు చొప్పున పాలలో లేదా తేనెతోపాటు కలిపి తీసుకుంటే కడుపు మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

3. పచ్చి అరటిని ఎండబెట్టి పొడిచేసుకుని అరస్పూను చొప్పున తీసుకోవాలి. అందులో పంచదార, చిటికెడు వాముపొడి కలిపి తినాలి. సోంపు అరచెంచా, ఉసిరిక పొడి, చిటికెడు పటిక బెల్లం తగినంత కలిపి భోజనం తరవాత తిన్నా ఫలితం ఉంటుంది.

4. ఒక టేబుల్ స్పూన్ తేనె, అరటీస్పూన్ టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని భోజ‌నం త‌రువాత తీసుకుంటే గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

5. ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ గోరు వెచ్చ‌ని పాల‌లో 1 టీ స్పూన్ తేనెను క‌లిపి త‌ర‌చూ తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌లు, కడుపులో మంట పోతాయి.