Black Tea : అలసటను దూరం చేయటంతోపాటు, శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపే తేనె, నిమ్మరసంతో కూడిన బ్లాక్ టీ!

నిమ్మరసం, తేనె కలిపి తీసుకునే బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనే వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. నిమ్మరసంతో కూడిన బ్లాక్ టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోంటే జీర్ణ ప్రక్రియ సజావుగా ఉంటుంది.

Black Tea : ఉదయం లేవగానే ఓ  క‌ప్పు టీ తాగితే ఆ రోజంతా ఫ్రెష్‌గా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక తలనొప్పి, బద్ధకం, ఆఫీస్ పని వల్ల ఒత్తిడిగా అనిపించినా ఓ కప్పు టీ తాగాల్సిందే. అయితే రోజువారిగా తాగే గ్రీన్ టీ, తులసి ఆకుల టీ, లెమన్ టీ, ఆరెంజ్ టీ, గ్రీన్ కాఫీ, మాచా టీ వంటివి వాటి కన్నా కాస్త భిన్నంగా నిమ్మరసం తేనె కలిపిన బ్లాక్ టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగించే వాటిలో బ్లాక్ టీ ఒకటి. దీనిని తయారు చేసుకునేందుకు ఇంట్లో అందుబాటులో ఉండే పదార్ధాలు
ఉపయోగిస్తే సరిపోతుంది.

తేనె ,నిమ్మరసంతో కూడిన బ్లాక్ టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

రోజూ బ్లాక్ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వాస్తవానికి శరీరంలో టాక్సిన్ పేరుకుపోతే తరచుగా ఆనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. తేనెతో కూడిన బ్లాక్ టీ ప్రముఖ డిటాక్సిఫైయర్లలో ఒకటి. ఇది శరీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను బయటకు పంపటంలో సహాయపడుతుంది. దీని ద్వారా మనం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారించవచ్చు.

నిమ్మరసం, తేనె కలిపి తీసుకునే బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనే వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. నిమ్మరసంతో కూడిన బ్లాక్ టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోంటే జీర్ణ ప్రక్రియ సజావుగా ఉంటుంది. అధికబరువు మరియు అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడే వారికి బ్లాక్ టీ మరియు నిమ్మరసం తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, శరీరంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు పెరుగుతాయి. రోగనిరోధశక్తి తగ్గకుండా ఉండాలంటే బ్లాక్ టీ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

జ్వరం, జలుబు, అలసట, నీరసం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. . ఫ్లూ మరియు జలుబు నివారించాలంటే బ్లాక్ టీకి కొద్దిగా నిమ్మరసం చేర్చి తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ టీ తాగితే జ్వరం మరియు జలుబు త్వరగా తగ్గుతాయి. అలసటను ఎదుర్కోగల శక్తిని అందించడంలో బ్లాక్ టీలో ఉంది. కాబట్టి మీకు అలసట అనిపించిన సందర్భంలో ఒక కప్పు నిమ్మరసం తో కూడిన బ్లాక్ టీ తీసుకోవటం మర్చిపోకండి. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. చర్మ క్యాన్సర్‌ను నయం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్‌ను దరిచేరకుండా చూస్తాయి.

ట్రెండింగ్ వార్తలు