Blisters and burns on the body to heal quickly?
Burn Blister : ఎండలో తిరగటం వల్ల కొంత మందిలో శరీరంపై బొబ్బలు వస్తాయి. నిప్పు రవ్వలు పడటం వల్ల కూడా కాలిన గాయాలు ఏర్పడతాయి. రేడియేషన్ వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవటానికి కొన్ని గృహచిట్కాలు బాగా ఉపకరిస్తాయి. అవేంటో తెలుసకునే ప్రయత్నం చేద్దాం…
1. కలబంద గుజ్జును కాలిన గాయాలపై మందంగా రాయాలి. గుజ్జు లేకపోతే రసాన్ని గాయాలపై రాయవచ్చు. రోజుకు రెండు సార్లు ఈ రసాన్ని రాస్తే ఎంతో ఫలితం ఉంటుది.
2. పసుపు పొడిలో తేనె కలిపి రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి టెంకను బాగా కాల్చి, దాని చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాయటం వల్ల గాయాలు త్వరగా మానతాయి.
3. గోరింటాకు ముద్దలో వెనిగర్ గానీ లేదంటే నిమ్మరసం గాని కలిపి గాయాలపై పూస్తే ఉపశమనం కలుగుతుంది. మంట బాధ తప్పుతుంది.
4. చర్మం కాలితే కాలిన చోట 10 నిమిషాల పాటు చల్లని నీటిని ధారలా పోయాలి. పొక్కులు వస్తే వాటిని తొలగించకుండా ఉండాలి. తొలగిస్తే మాత్రం ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
5. కోడిగుడ్డులోని తెల్లని సొనలో తుమ్మబంక పొడి , కొబ్బరి నూనె కలిపి పూస్తే కాలిన గాయాలకు ఉపశమనం కలుగుతుంది.
6. కాలిన గాయాలను తొందరగా తగ్గించడానికి టూత్ పేస్ట్ చక్కగా సహాయపడుతుంది. ముందుగా కాలిన గాయాలని నీటితో శుభ్రపరిచి తరువాత మెత్తని పొడి బట్టతో గాయాన్ని తుడవాలి. ఇలా డ్రై గా మారిన తరువాత కాలిన గాయం మీద టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి.
7. కాలిన గాయాలు తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం మంచిది.